News September 1, 2025

దారుణంగా రహదారులు.. బిల్లులు ఇవ్వక ఇబ్బందులు

image

ఏఎంసీ రోడ్ల పనులపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో నెల్లూరు జిల్లాలో కీలక రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. 2022లో 222 రోడ్లను రూ.185.40 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు వచ్చినా, నిధుల సమస్యతో కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గారు. ఇప్పటివరకు 51 పనులు మాత్రమే ప్రారంభమై 26 పూర్తి కాగా, 25 ఆగిపోయాయి. మిగతా 171 పనులు అసలు మొదలుకాలేదు. చేసిన పనులకే బిల్లులు ఇవ్వకపోవడంతో కొత్త పనులు చేయడం లేదు.

Similar News

News September 4, 2025

నెల్లూరు: రైతు బజారులో కిలో ఉల్లి రూ.16

image

నెల్లూరు జిల్లాలోని పలు రైతు బజార్లలో ఉల్లిపాయలను సబ్సీడీపై విక్రయిస్తున్నారు. పొదలకూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న రైతు బజారులో బుధవారం నుంచి కిలో రూ.16కు అందిస్తున్నట్లు నెల్లూరు మార్కెటింగ్ శాఖ ఏడీ అనితా కుమారి తెలిపారు. బయట మార్కెట్లో ఉల్లిపాయల ధర కిలో రూ.30గా ఉంది. సబ్సిడీపై రూ.16కే ఇస్తున్నామని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 4, 2025

నెల్లూరు పూర్వ కమిషనర్లపై అవినీతి ఆరోపణలు

image

నెల్లూరులో అపార్టుమెంట్లకు ఆక్యూపెన్సీ లేకుండానే మార్టిగేజ్‌(రుణాలు)లు రిలీజ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 72 అపార్ట్‌మెంట్లకు సంబంధించి పూర్వ కార్పొరేషన్ కమిషనర్లు హరిత, వికాస్ మర్మత్, చెన్నుడులు రూ.18 కోట్ల మేర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రస్తుత కమిషనర్ ఓ.నందన్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి మరి.

News September 4, 2025

NLR: మిగిలిన బార్లకు నేటి నుంచి దరఖాస్తులు

image

నెల్లూరు జిల్లాలో మొదటి విడత ముగిసిన తర్వాత మిగిలిన బార్లకు నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆ తర్వాత నెల్లూరు కలెక్టరేట్‌లో లక్కీ డిప్ తీస్తారు. నెల్లూరు, కావలి, బుచ్చి, ఆత్మకూరు, అల్లూరు ప్రాంతాల్లో 31 బార్లకు అవకాశం ఉంది.