News January 17, 2025
దావోస్‌కు మంత్రి టీజీ భరత్

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ దావోస్‌కు వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో కలిసి ఆయన రేపు రాత్రి పయనం అవుతారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని వారు ప్రసంగించనున్నారు. రాష్ట్రంలోని అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించనున్నారు.
Similar News
News March 12, 2025
పోసాని నేడు విడుదలయ్యేనా?

కర్నూలు జిల్లా జైలులో ఉన్న పోసాని కృష్ణమురళి విడుదలపై ఉత్కంఠ నెలకొంది. ఆయనకు కర్నూలు JFCM కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనపై రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జైలు నుంచి విడుదలయ్యేలోపు ఏ స్టేషన్ పోలీసులైనా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చన్న ప్రచారం నడుస్తోంది. కాగా ఈ నెల 4 నుంచి పోసాని కర్నూలు జైలులో ఉన్నారు.
News March 12, 2025
ఆదోని ఘటనపై సీఎం, మంత్రుల దిగ్ర్భాంతి

ఆదోని మండలం పాండవగల్లు <<15730038>>వద్ద<<>> జరిగిన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించడంపై CM చంద్రబాబు, మంత్రులు లోకేశ్, టీజీ భరత్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొని టీడీపీ కార్యకర్తలు ఈరన్న, ఆదిలక్ష్మి దంపతులతో పాటు ముగ్గురు కర్ణాటక వాసులు మృతిచెందడం అత్యంత బాధాకరమని తెలిపారు. ప్రమాద ఘటనపై అధికారులను వాకబు చేశారు. మృతిచెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
News March 11, 2025
కర్నూలు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

➤కర్నూలు: ఇంటర్ పరీక్షల్లో ముగ్గురు డీబార్➤ ఆదోని మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి➤ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ➤ బీటీ నాయుడి ఆస్తులు రూ.5.68కోట్లు ➤ ఆలూరు: వైసీపీ ‘యువత పోరు’ అంటూ కొత్త డ్రామా➤ నటుడు పోసానికి ఆదోని కేసులో బెయిల్ మంజూరు➤ నందవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి➤ వైసీపీపై మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జి మండిపాటు ➤ పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ బస్సు సౌకర్యం