News December 1, 2025

‘దిత్వా’.. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు భారీ వర్ష సూచన

image

‘దిత్వా’ తుఫాన్ ప్రభావం కారణంగా DEC 2 నుంచి 5 వరకు తీవ్ర వర్ష ప్రభావం ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాలు, చలిగాలుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Similar News

News April 9, 2026

ఓటేసిన ప్రముఖులు.. PHOTOS

image

కేరళం, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. తొలి రెండు గంటల్లో కేరళంలో 16.23, అస్సాంలో 17.87, పుదుచ్చేరిలో 17.71 శాతం పోలింగ్ నమోదైంది. కేరళంలో సీఎం విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపి, నటులు మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఓటు వేశారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామి బైక్‌పై వచ్చి ఓటేశారు.

News April 9, 2026

ADB: ​బ్రిటిష్ సైన్యాన్ని వణికించిన రాంజీ గోండ్

image

స్వేచ్ఛా భారతం కోసం ఆదిలాబాద్ అడవుల్లో ఆంగ్లేయులను గడగడలాడించిన వీరుడు రాంజీ గోండ్. 1857 తిరుగుబాటు కాలంలో నిజాం అండతో విర్రవీగిన బ్రిటిష్ సేనలపై గెరిల్లా దాడులతో విరుచుకుపడ్డారు. అడవి బిడ్డల హక్కుల కోసం పోరాడి, నిర్మల్ వెయ్యి ఊడల మర్రికి వేలాడినా లొంగని ఆత్మగౌరవ శిఖరం ఆయన. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో రాంజీ గోండ్ ఎప్పటికీ ఒక ధ్రువతారే!
# నేడు రాంజీ గోండ్ వర్ధంతి

News April 9, 2026

HYD: అలా అయితే మీ రేషన్‌కార్డ్ కట్!

image

TG విజిలెన్స్ విభాగం రహస్య ఆడిట్ చేసింది. PAN, GST నంబర్లను రేషన్‌కార్డు డేటాతో లింక్ చేస్తే HYDలో దాదాపు 2 లక్షల మంది IT చెల్లింపుదారులు బియ్యం కార్డులు కలిగి ఉన్నట్లు గుర్తించింది. ఇప్పటికే 80% వెరిఫికేషన్ పూర్తైందని అంతర్గత సమాచారం. IT పేయర్స్, Govt ఉద్యోగుల కార్డులను AI సాఫ్ట్‌వేర్‌తో గుర్తించారు. వీటిని రద్దు చేయడం, గతంలో పొందిన సబ్సిడీని రికవరీ చేసేలా చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధమైంది.