News February 8, 2025
దిలావర్పూర్: ఆయిల్ ఫామ్‌తో రైతులకు లాభసాటి

ఆయిల్ ఫామ్ మొక్కలను నాటుకోవడంతో రైతులకు లాభదాయకంగా ఉంటుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి వి. రమణ అన్నారు. దిలావర్పూర్ మండలంలో ఆయా రైతులు నాటిన తోటలను సందర్శించారు. అనంతరం రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలపై రాయితీ వివరాలు తెలిపారు. మొక్కలు నాటిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను పేర్కొన్నారు. ఇందులో డివిజన్ మేనేజర్ శేఖర్, క్లస్టర్ ఆఫీసర్ ప్రశాంత్, రైతులు ఉన్నారు.
Similar News
News December 26, 2025
మిరపలో పూత పురుగును ఎలా నివారించాలి?

మిరప పూత మొగ్గలపై ఈ మొగ్గలు గుడ్లు పెడతాయి. వీటి నుంచి బయటకు వచ్చిన చిన్న లార్వాలు పూలలోని అండాశయాన్ని తొలిచి తింటాయి. దీని వల్ల అండాశయం తెల్లగా మారి ఉబ్బుతుంది. మొగ్గలు విచ్చుకోకుండ రాలిపోతాయి. పిందే దశలో కాయలు గిడసబారి గింజలు లేకుండా త్వరగా పండుబారి విపరీతంగా రాలిపోతాయి. పూత పురుగును నివారించడానికి లీటరు నీటికి Tolfenpyrad అనే మందు 2mlను కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 26, 2025
HYD: బల్దియా ‘వసూళ్ల’ వేట.. సామాన్యుడికి వాత!

నగరవాసులపై పన్నుల భారాన్ని మోపేందుకు GHMC సిద్ధమైంది. డీలిమిటేషన్ సాకుతో ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా అధికారులు వసూళ్ల వేట ప్రారంభించారు. పాత, కొత్త సర్కిళ్లలో కలిపి రోజువారీగా రూ.7కోట్ల మేర పన్నులు రాబట్టాలని ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. నెలకు సుమారు రూ.210కోట్లు ప్రజల నుంచి వసూలు చేయనున్నారు. మౌలిక వసతుల కల్పనను గాలికొదిలేసి, కేవలం పన్నుల వసూళ్లపైనే ప్రతాపం చూపడంపై ప్రజలు మండిపడుతున్నారు.
News December 26, 2025
ప్రతి పనికీ AI ఉపయోగిస్తున్నారా?

ప్రతి చిన్న పనికీ AI టూల్స్‌ను ఉపయోగించే అలవాటు పెరుగుతోంది. కానీ ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కొంతమంది విద్యార్థులను మూడు విభాగాలుగా చేసి.. వారిని ChatGPT, Google Gemini సాయంతో పాటు సొంతంగా ఎస్సే రాయమన్నారు. AIని ఉపయోగించిన వారి ఆలోచనల్లో చురుకుదనం లేదని గుర్తించారు. అధికంగా AIపై ఆధారపడితే జ్ఞాపకశక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.


