News September 23, 2025

దిలావర్పూర్: ఇక్కడ కోనేరులో బతుకమ్మల నిమజ్జనం

image

దిలావర్పూర్‌లో బతుకమ్మను నిమజ్జనం చేసే స్థలానికి ఓ ప్రత్యేకత దాగి ఉంది. పలుచోట్ల బతుకమ్మ నిమజ్జనాలు చెరువుల్లో, నదుల్లో వేస్తారు. కానీ ఇక్కడ చివరి రోజు అంగరంగ వైభవంగా కోలాలతో నృత్యాలు చేస్తూ రేణుక ఎల్లమ్మ కోనేరులో నిమజ్జనం చేస్తారు. ఈ కోనేరుకు చర్మ వ్యాధులను దూరం చేసే మహత్యం ఉందని విశిష్ట నమ్మకం. కోనేరులో బతుకమ్మలు వేయడం వల్ల మరింత శుద్ధి అవుతుందని నమ్మకం.

Similar News

News September 23, 2025

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ప్రకాశం ఎస్పీ

image

ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతిని నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తికి మొక్కను ఎస్పీ అందజేశారు. అనంతరం బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా పోలీస్ శాఖ తరపున కృషి చేయనున్నట్లు జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.

News September 23, 2025

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అటు తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్‌లో భారీ వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది.

News September 23, 2025

నర్సాపూర్: అనుమానాస్పద స్థితిలో డ్రైవర్ మృతి

image

శివంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి నర్సింలు(40) అనే డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం నర్సాపూర్‌లో తన స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.