News April 16, 2025
దిలావర్పూర్: జీవనోపాధికి వచ్చి మృత్యుఒడికి చేరి

దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ వద్ద జరిగిన యాక్సిడెంట్లో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు MHలోని హిమాయత్‌నగర్ తాలుక దబ్దారికి చెందిన వ్యక్తి. 4 నెలల కిందట కుటుంబంతో బతుకుదెరువు కోసం సముందర్‌పల్లిలోని ఇటుక బట్టీల్లో కార్మికులుగా చేరారు. మంగళవారం జరిగిన ప్రమాదంలో రాజు మృతి చెందగా.. కొడుకు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. రాజు భార్య లక్ష్మిబాయి, కూతురు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు.
Similar News
News September 18, 2025
KNR: చేతిరాత చాలా ముఖ్యమైంది: కలెక్టర్

కరీంనగర్‌లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం రాత్రి జిల్లా స్థాయి చేతిరాత విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి హాజరై మాట్లాడారు. హ్యాండ్ రైటింగ్ జీవితంలో చాలా ముఖ్యమైందని, దీనిని ఇంప్రూవ్ చేసుకోవాలని సూచించారు. చేతిరాత అంటే మైండ్ రైటింగ్ అని, మేధస్సుకు పదును పెట్టి మనిషి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.
News September 18, 2025
జూబ్లీహిల్స్ బరిలో బీజేపీ నాయకురాలు?

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు ఆశావహులు ఆయా పార్టీల్లో తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి కొత్త పేరు బయటకు వచ్చింది. ఆ పార్టీ HYD నేత మాధవీలత పోటీచేసేందుకు ఆసక్తిచూపుతున్నారని సమాచారం. తాను పోటీచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని, ఆ అదృష్టం దక్కాలని కోరుకుంటున్నానని బోరబండలో పేర్కొన్నారు. మాధవీలత గతంలో HYD ఎంపీ స్థానానికి పోటీచేసి పరాజయం పాలయ్యారు.
News September 18, 2025
జూబ్లీహిల్స్‌లో ‘కలర్ ఫొటో’కు అవకాశం?

త్వరలో బిహార్‌లో జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల కలర్ ఫొటోలను ఈవీఎంలలో ఉపయోగించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అమలు చేస్తారో? లేదో? కమిషన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే కలర్ ఫొటో గురించి ఇప్పటికే అన్ని రాష్ర్టాలకూ ఈసీ లేఖలూ రాసింది. ఇదే జరిగితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాడే EVMలలో అభ్యర్థుల కలర్ ఫొటో చూసి ఓటేయవచ్చన్న మాట.