News March 21, 2025
దిలావర్పూర్: తాగునీటికోసం ‘భగీరథ’ ప్రయత్నం

గ్రామాల్లో తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. వేసవి కాలంలో అడుగంటుతున్న భూగర్భ జలాలు సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. ఇంటింటికి నల్లా నీరు అంటూ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం అధికారుల నిర్లక్ష్యంతో ప్రయోజనం లేకుండా పోతోంది. ఇంటింటికీ భగీరథ నీరు పంపిణీ కావడం లేదు. గ్రామస్థులు మీటరు లోతు వరకు తవ్వి భగీరథ నీటిని పట్టుకుంటున్నారు. తాగు నీటికోసం ప్రజలకు ‘భగీరత’ ప్రయత్నం చేయక తప్పడం లేదు.
Similar News
News November 3, 2025
ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు ఏరియల్ సర్వే

నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ భద్రత, పనుల పూర్తి కోసం ఏరియల్ ఎలెక్ట్రోమాగ్నెటిక్ సర్వే సోమవారం ప్రారంభం కానుంది. సీఎం, మంత్రి ఉత్తమ్ సమక్షంలో ఎన్‌జీఆర్ఐ ఆధ్వర్యంలో ఈ హెలిబోర్న్ మాగ్నెటిక్ సర్వే మొదలు పెడతారు. 1000 మీటర్ల లోతు వరకు జియోలాజికల్ డేటా సేకరణ లక్ష్యంగా 200 కిలోమీటర్ల మేర హెలికాప్టర్ ఫ్లైయింగ్ షెడ్యూల్ చేశారు.
News November 3, 2025
MDK: చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలైన ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
News November 3, 2025
గర్భిణుల్లో విటమిన్ D లోపం ఉంటే ఈ సమస్యలు

ప్రెగ్నెన్సీలో మహిళలు అన్ని పోషకాలు అందేలా ఆహారం తీసుకోవాలి. అప్పుడే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టుకతో ఎలాంటి లోపాలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా గర్భిణుల్లో విటమిన్ డి లోపం ఉండడం వల్ల శిశువులు అధిక బరువు, గుండె జబ్బులు, మల్టిపుల్ స్లెరోసిస్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ D సప్లిమెంట్లు వాడటం, సూర్యరశ్మిలో సమయం గడపడం వల్ల దీన్ని అధిగమించొచ్చని సూచిస్తున్నారు.


