News November 4, 2024
దిలావర్పూర్: ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్

దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాడనే కారణంతో అరేపల్లి విజయ్ కుమార్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంత కాలంగా ఇథనాల్ పరిశ్రమ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దిలావర్ పూర్, గుండంపల్లి గ్రామస్థులు, రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News November 11, 2025
సజావుగా సాగుతున్న పంటల కొనుగోళ్ల: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభమై కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వరి, పత్తి, సోయా కొనుగోళ్లపై మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణారావు కలిసి నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో 11 పత్తి కొనుగోలు కేంద్రాలు, 33 జిన్నింగ్ మిల్లులు ద్వారా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు.
News November 10, 2025
ఆదిలాబాద్: సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: ఎస్పీ

ఆదిలాబాద్ పట్టణంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల రోజును ఎస్పీ అఖిల్ మహాజన్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎస్పీని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్క సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు.
News November 10, 2025
ఆదిలాబాద్: PGలో స్పాట్ అడ్మిషన్లు

ADB పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.జే సంగీత, పీజీ కోఆర్డినేటర్ డా. రాజ్ కుమార్ తెలిపారు. తుది విడత పీజీ అడ్మిషన్లలో బోటనీలో 40, జువాలజీలో 56 అడ్మిషన్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్‌లో సీటు వచ్చిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని పేర్కొన్నారు.


