News April 15, 2025

దిలావర్పూర్:  రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి

image

యాక్సిడెంట్‌లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన మంగళవారం దిలావర్పూర్ మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నిర్మల్ భైంసా హైవేపై సిర్గాపూర్ వద్ద బైంసా వైపు నుంచి బైక్‌పై వస్తున్న ఇద్దరు మేస్త్రీలను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 17, 2025

నా రాజీనామాను ఇంకా ఆమోదించలేదు: కవిత

image

TG: MLC పదవికి తన రాజీనామాను ఇంకా ఆమోదించలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుబాటులో లేరని చెప్పారు. ‘రాజీనామాను ఆమోదించిన 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అంటున్నారు. నేను ఎన్నికైనప్పుడు ఆ సీటు 6 నెలలకు పైగా ఖాళీగానే ఉంది. అవసరమైతే ఛైర్మన్‌ను మళ్లీ కలుస్తా’ అని మీడియా చిట్ చాట్‌లో వ్యాఖ్యానించారు.

News September 17, 2025

పొగాకు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

నల్లబర్లీ పొగాకు కొనుగోలులో అంతరాయం లేకుండా అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. బాపట్లలోని వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. నల్లబర్లీ పొగాకు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. నల్లబర్లీ పొగాకు కొనుగోలుపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News September 17, 2025

HZB: తల్లిని చూసుకుంటామని ముందుకొచ్చిన కుమారులు

image

హుజూరాబాద్ మండలం కనుకులగిద్దెకు చెందిన ములుగు రాజమ్మ తన ముగ్గురు కుమారులు తనను పోషించడం లేదని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన RDO ముగ్గురు కుమారులు ఒక్కొక్కరు నెలకు రూ.3,000 చొప్పున తల్లి పోషణ నిమిత్తం ఇవ్వాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. కాగా, దీని అమలుపై జిల్లా కలెక్టర్, సంక్షేమ అధికారిణి ఆధ్వర్యంలో విచారణ జరపగా రాజమ్మ కుమారులు ఇకపై తమ తల్లిని చక్కగా చూసుకుంటామని హామీ ఇచ్చారు.