News March 18, 2025

దిల్‌సుఖ్‌నగర్‌లో యువతులతో వ్యభిచారం.. ARREST

image

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతులను ఆకర్షించి, విటుల వద్దకు పంపుతున్న ఓ మహిళను హ్యూమన్ ట్రాఫికింగ్, సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఆమెను దిల్‌సుఖ్‌‌నగర్‌లోని కమలానగర్ వద్ద రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువతుల ఫొటోలను వాట్సాప్ ద్వారా కస్టమర్లకు పంపి సినిమా పేరుతో వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు గుర్తించారు.

Similar News

News November 6, 2025

రెండో రోజూ ఏసీబీ సోదాలు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 12 కార్యాలయాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల ట్యాంపర్‌లో ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఉందని తెలుస్తోంది. లెక్కల్లో చూపని నగదును పెద్దమొత్తంలో అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

News November 6, 2025

ఫూట్ బాల్ రాష్ట్ర స్థాయి విజేత ఉమ్మడి మెదక్

image

వికారాబాద్‌లో జరిగిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్- 14 బాలికల విభాగంలో రాష్ట్రస్థాయి ఫూట్ బాల్ పోటీలో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు ఉమ్మడి పది జిల్లాల నుంచి వచ్చిన జట్లతో పోటీపడి విజేతగా నిలిచింది. విజయం సాధించిన బాలికల జట్టుకు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు.

News November 6, 2025

రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీకి వరంగల్ వేదిక

image

వరంగల్ జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో హనుమకొండ పబ్లిక్‌ గార్డెన్‌ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి చెస్‌ టోర్నీ నిర్వహించనున్నట్లు కార్యదర్శి కన్నా తెలిపారు. బాలబాలికల విభాగంలో రెండు రోజుల పాటు పోటీలు జరుగుతాయని, విజేతలకు నగదు బహుమతులు, మెడల్స్‌, ప్రశంసాపత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు.