News February 14, 2025

దివాన్ చెరువు: లారీ డ్రైవర్ పై దుండగులు దాడి

image

ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామానికి చెందిన లారీడ్రైవర్‌ చంద్రుడు దివాన్‌చెరువు పండ్లమార్కెట్‌ దాటిన తరువాత రోడ్డుపక్కన లారీని ఆపాడు. గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి డ్రైవర్‌పై దాడిచేసి రూ.7,800 నగదు, రెండుసెల్‌ ఫోన్లు లాక్కుని పారిపోయారు. డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 15, 2025

తూ.గో: సదరం క్యాంపులు ప్రారంభం

image

తూ.గో జిల్లా వ్యాప్తంగా కొత్త సదరం సర్టిఫికెట్ల జారీ కోసం స్లాట్‌ బుకింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమైందని DCHS డా.ఎం.పద్మ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, ప్రతి మంగళవారం ఏరియా హాస్పిటళ్లు, జిల్లా ఆసుపత్రులు, GGHల్లో సదరం సర్టిఫికెట్ల కోసం స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామని చెప్పారు.

News November 15, 2025

దివాన్ చెరువులో కొత్త బిల్డింగ్‌కు రూ.3కోట్లు

image

రాజమహేంద్రవరం రూరల్ డివిజన్, సబ్-డివిజన్, రూరల్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసులకు సంబంధించిన భవనాలు వేర్వేరు చోట్ల ఉన్నాయి. ఇవన్నీ ఒకేచోట ఉండేలా దివాన్ చెరువులో కొత్తగా భవనం నిర్మించనున్నారు. దీని కోసం రూ.3కోట్లు మంజూరయ్యాయని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. నిధులు మంజూరు చేసిన ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజకి కృతజ్ఞతలు తెలిపారు.

News November 14, 2025

రాజమండ్రిలో రేషన్ డీలర్‌పై కేసు నమోదు

image

రాజమండ్రిలోని నెం.39 రేషన్ షాపును ఆర్డీవో కృష్ణనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ అందుబాటు, పంపిణీ రిజిస్టర్లు, ఆన్‌లైన్ రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. స్టాక్‌కు ఆన్‌లైన్ రికార్డులకు మధ్య 360 కిలోల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత రేషన్ షాపు డీలర్‌పై నిత్యావసర సరుకుల యాక్ట్ సెక్షన్ 6A కింద కేసు నమోదు చేశారు.