News November 19, 2025

దివిసీమ జల ప్రళయానికి 48 ఏళ్లు

image

AP: దివిసీమ జల ప్రళయానికి నేటితో 48 ఏళ్లు పూర్తయ్యాయి. 1977 నవంబర్ 19న కడలి ఉప్పొంగడంతో ఊళ్లు శవాల దిబ్బలుగా మారాయి. కృష్ణా జిల్లాలోని నాలి, సొర్లగొంది, సంగమేశ్వరం, గుల్లలమోద, హంసలదీవి తదితర ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఎంతో మంది జల సమాధి అయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం 14 వేల మందికిపైగా చనిపోయారు. ఘటన జరిగిన 3 రోజుల వరకు బాహ్య ప్రపంచానికి ఈ విషయం తెలియకపోవడం అత్యంత బాధాకరం.

Similar News

News November 22, 2025

యాపిల్ ఎయిర్‌డ్రాప్ ఫీచర్ క్రాక్ చేసిన గూగుల్

image

ఐఫోన్లలో ఉండే క్విక్ షేర్ ఫీచర్ ఎయిర్‌డ్రాప్‌ను గూగుల్ క్రాక్ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్లకు డేటా, ఫొటోలు, వీడియోలు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చని వెల్లడించింది. యాపిల్ సహకారం లేకుండానే దీనిని సాధించామని గూగుల్ ప్రతినిధి అలెక్స్ మొరికోనీ తెలిపారు. పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అన్ని మోడల్స్‌లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీని వల్ల యూజర్ల సేఫ్టీకి ఏ ఇబ్బంది ఉండదన్నారు.

News November 22, 2025

IIT హైదరాబాద్‌లో స్టాఫ్ నర్స్ పోస్టులు

image

<>IIT <<>>హైదరాబాద్‌లో 2 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు డిసెంబర్ 15న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.35వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: iith.ac.in

News November 22, 2025

కివీతో ఎన్నో లాభాలు

image

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.