News December 12, 2025

దివ్యాంగుడి సమస్య విన్న కలెక్టర్

image

భీమవరం మండలం గూట్లపాడుకి చెందిన గౌరీ శంకరరావు కుటుంబ సభ్యులు శుక్రవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశానికి వచ్చారు. వీరిని చూసిన కలెక్టర్ చదలవాడ నాగరాణి దివ్యాంగుడు శంకర్ పరిస్థితిని చూసి సమస్యను అడిగి తెలుసుకున్నారు. పుట్టుకతోనే అంగవైకల్యం ఉండడంతో దివ్యాంగ ఫించన్ రూ. 6 వేల వస్తోందని, వందశాతం అంగవైకల్యం ఉన్న తనకు రూ.15 వేల పింఛన్ ఇవ్వాలని కోరాడు. ఈ అర్జీని కలెక్టర్ అధికారులకు సిఫార్సు చేశారు.

Similar News

News April 15, 2026

భీమవరం: నేడే ఇంటర్మీడియట్ రిజల్ట్స్

image

ఇంటర్ ఫలితాలు బుధవారం ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్నాయి. దీంతో పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠత నెలకొంది. ఈ ఏడాది 53 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరంలో 19,662 మంది, ద్వితీయ సంవత్సరంలో 17,888 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల తరువాత స్టూడెంట్స్ ఒత్తిడికి గురికాకుండా పేరెంట్స్ టీచర్స్ ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

News April 15, 2026

ఈనెల 15న భీమవరంలో పారిశ్రామిక విధానంపై సదస్సు

image

భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఎంఎస్ఎంఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో ఎమ్మెల్యే రామాంజనేయులు, ఏపీఐఐసీ ఛైర్మన్ రామరాజు పాల్గొంటారు. కొత్త పారిశ్రామిక విధానంపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.