News December 10, 2025

దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే టిడ్కో ఇళ్లు: కలెక్టర్

image

జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు టిడ్కో ఇళ్లు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే మంజూరయ్యేలా చూస్తామని కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. ఎవరికీ మంజూరు చేయని ఇళ్లలో వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. దివ్యాంగుల క్రీడా పోటీలను ప్రారంభించి, మాట్లాడిన ఆమె.. క్రీడల్లో రాణించిన వారికి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Similar News

News April 14, 2026

అరుణాచల్ ప్రదేశ్‌ మాదే: చైనా

image

అరుణాచల్ ప్రదేశ్‌లో <<19633032>>గ్రామాల<<>> పేర్లు మార్చడంపై భారత్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నా చైనా తగ్గడం లేదు. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే కాదని లేటెస్ట్‌గా ఆ దేశ విదేశాంగ ప్రతినిధి జియాకున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్ అక్రమంగా ఏర్పాటు చేసుకుందని, దీనిని చైనా ఎప్పటికీ గుర్తించదన్నారు. అరుణాచల్‌ను జాంగ్‌నాన్ (దక్షిణ టిబెట్)గా పేర్కొంటూ.. ఇది తమ భూభాగమేనని చైనా వాదిస్తోంది.

News April 14, 2026

వెరీ స్లో ఇన్నింగ్స్.. కోహ్లీపై చోప్రా విమర్శలు

image

ఈనెల 12న ముంబైతో మ్యాచులో RCB ఓపెనర్ విరాట్ కోహ్లీ చాలా స్లోగా ఆడారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శించారు. ‘RCB గెలిచినప్పటికీ T20 క్రికెట్ కోణంలో చూస్తే అది చాలా స్లో ఇన్నింగ్స్. విరాట్ స్థాయికి తగ్గట్లుగా లేదు. ఆయన మైండ్‌సెట్ కూడా సరిగా లేనట్లు అనిపించింది. వైడ్ బాల్స్ కోసం రెండు రివ్యూలు వృథా చేశారు’ అని తన యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నారు. ఈ మ్యాచులో కోహ్లీ 38 బంతుల్లో 50 రన్స్ చేశారు.

News April 14, 2026

ప్రపంచ మేధావి అంబేడ్కర్: కలెక్టర్ వెట్రిసెల్వి

image

భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అంబేడ్కర్ అని కలెక్టర్ వెట్రిసెల్వి కొనియాడారు. ఏలూరు కలెక్టరేట్‌లో అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. అంటరానితనం, కుల వివక్షపై రాజీలేని పోరాటం చేసిన అంబేడ్కర్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.