News November 26, 2025

దివ్యాంగులకు స్కూటర్లు.. దరఖాస్తు గడువు పెంపు

image

AP: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం 100శాతం రాయితీతో త్రీ వీలర్ స్కూటర్లను ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 25 నుంచి 30వ తేదీకి పొడిగించింది. జిల్లాకు 80 స్కూటర్ల చొప్పున మంజూరు చేయనుంది. 18-45 ఏజ్, 70%+ వైకల్యం, సదరం సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. టెన్త్ చదివి ఉండాలి.
వెబ్‌సైట్: https://apdascac.ap.gov.in/

Similar News

News December 1, 2025

క్యారెట్ సాగు – ముఖ్యమైన సూచనలు

image

క్యారెట్ శీతాకాలం పంట. దీన్ని ఆగస్టు-డిసెంబర్ మధ్యలో నాటుకోవచ్చు. నాణ్యమైన దిగుబడి రావాలంటే 18-24 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత అవసరం. క్యారెట్ సాగుకు మురుగునీటి వసతి గల లోతైన, సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలం. బరువైన బంకనేలలు పనికిరావు. నేల ఉదజని సూచిక 6.5గా ఉంటే మంచిది. ఎకరాకు 2 కేజీల విత్తనాలు అవసరం. ప్రతి 15 రోజుల తేడాలో విత్తనాలు విత్తుకుంటే డిమాండ్‌కు అనుగుణంగా మంచి దిగుబడి సాధించవచ్చు.

News December 1, 2025

ఇకపై అన్ని ఫోన్లలో ప్రభుత్వ యాప్.. డిలీట్ చేయలేం!

image

దేశంలో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు మొబైల్ తయారీ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలిచ్చినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఇకపై తయారయ్యే ఫోన్లలో తప్పనిసరిగా ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్‌ ‘సంచార్ సాథీ’ని డిఫాల్ట్‌గా ఇవ్వాలని స్పష్టం చేసినట్లు తెలిపింది. ఈ యాప్‌ను డిలీట్ చేయలేరు. ఇందుకు 90 రోజుల గడువు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ అంశంపై అటు ప్రభుత్వం, ఇటు మొబైల్ కంపెనీలు అధికారికంగా స్పందించలేదు.

News December 1, 2025

‘చిన్నస్వామి’ సేఫ్టీ క్లియరెన్స్ కోరిన ప్రభుత్వం

image

RCB ర్యాలీలో తొక్కిసలాట నేపథ్యంలో వచ్చే IPLకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచులు జరగడంపై సందిగ్ధత నెలకొంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌కు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు ఇచ్చింది. స్టేడియం సేఫ్టీ రిపోర్ట్ సమర్పించాలని కోరింది. ఆ నివేదిక నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ నుంచి సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్‌తో ప్రిపేర్ చేయించాలని ఆదేశించింది.