News April 7, 2025
దివ్యాంగులకు 70 ట్రై సైకిళ్లు అందించిన పొదెం వీరయ్య

తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ CSRలో భాగంగా ఆదివారం కొత్తగూడెం ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 70 మంది దివ్యాంగులకు మోటర్ ట్రై సైకిళ్లను అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పొదెం వీరయ్య పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అటవీ అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ డాక్టర్ జి. స్కైలాబ్ పాల్గొన్నారు.
Similar News
News April 9, 2025
సంగారెడ్డి: ’11న మహాత్మ జ్యోతిబాపూలే జయంతి’

మహాత్మ జ్యోతిబాపూలే జయంతి కార్యక్రమం ఈనెల 11న నిర్వహిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ బుధవారం తెలిపారు. ఉదయం 9 గంటలకు ఆర్అండ్ బీ కార్యాలయం పక్కన ఉన్న ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అనంతరం కల్వకుంట రోడ్‌లో సభ జరుగుతుందని పేర్కొన్నారు . ప్రజా ప్రతినిధులు, దళిత, బీసీ సంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు.
News April 9, 2025
సాలార్జంగ్ మ్యూజియంలో అంబేడ్కర్ ఫొటో ఎగ్జిబిషన్

సాలార్జంగ్ మ్యూజియంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించినట్లుగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఘంటా చక్రపాణి, IIS డైరెక్టర్ ఆశిష్ గోయల్ తెలిపారు. అంబేడ్కర్ జీవితం మొత్తం కనులకు కట్టినట్లు ఎగ్జిబిషన్‌లో అద్భుతంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News April 9, 2025
ABHISHEK: పించ్ హిట్టర్‌కి సిక్సర్ల కరవు!

ఐపీఎల్ 2025లో SRH విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ తేలిపోతున్నారు. గత సీజన్‌లో అత్యధికంగా 42 సిక్సర్లు బాది టాప్‌లో నిలిచారు. కానీ ఈ సీజన్‌లో 5 మ్యాచులాడి ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయారు. పవర్ ప్లేలోనే ఆయన పెవిలియన్ బాట పడుతున్నారు. RR-24, LSG-6, DC-1, KKR-2, GTపై 18 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచారు. తర్వాతి మ్యాచుల్లోనైనా అభిషేక్ విజృంభించి ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.