News October 27, 2025
దివ్యాంగుల చట్టం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన భద్రాద్రి ఎస్పీ

కొత్తగూడెం పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల చట్టం 2016 సంబంధించిన వాల్ పోస్టర్లను సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. దివ్యాంగుల చట్టం 2016 ప్రకారం దివ్యాంగులను కించపరిచినా, అవహేళనగా మాట్లాడినా, ఎగతాళి చేసిన చట్టం ప్రకారం శిక్షకు గురి అవుతారని అన్నారు.
Similar News
News October 27, 2025
NRPT: మద్యం షాపుల లక్కీ డ్రా పూర్తి.. 34 దుకాణాలకు లైసెన్స్‌లు

మద్యం పాలసీ 2025–27కు సంబంధించి మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయేంద్ర బోయి ఆధ్వర్యంలో లక్కీ డ్రా పద్ధతిలో నిర్వహించారు. నారాయణపేట జిల్లాలో మొత్తం 34 మందికి లైసెన్స్‌లు మంజూరయ్యాయి. వీరిలో ముగ్గురు మహిళా అభ్యర్థులు ఉన్నారని ఎక్సైజ్ సీఐ అనంతయ్య తెలిపారు. కొత్త లైసెన్స్‌లు డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 30, 2027 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
News October 27, 2025
NRPT: చట్టప్రకారం ఫిర్యాదులు పరిష్కరించాలి

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీస్ అధికారులకు సూచించారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. మొత్తం అయిదు ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ చెప్పారు. ఆపదలో ఉంటే డయల్ 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని అన్నారు.
News October 27, 2025
HYD: మనిషి లేకుండా రోబోలతోనే వ్యవసాయం: వీసీ

మానవ రహిత వ్యవసాయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని HYD రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ VC జానయ్య తెలిపారు. ఆకుకూరల కోత, సంరక్షణ కోసం రూపొందించిన రోబోలు ఈ దిశగా కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు.అగ్రి హబ్ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.రోబోటిక్ టెక్నాలజీతో వ్యవసాయంలో సమయాన్ని, శ్రమను ఆదా చేయడంతోపాటు దిగుబడి పెంపు సాధ్యమవుతుందన్నారు.


