News August 18, 2025

దివ్యాంగ విద్యార్థులకు DEO సూచన

image

ప్రకాశం జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులకు DEO కిరణ్ కుమార్ కీలక సూచన చేశారు. ఒంగోలులోని డీఈవో కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన విడుదలైంది. 18న సంతనూతలపాడు, 19న వైపాలెం, 20న దర్శి, 21న ఒంగోలు, 22 కొండేపి, 23 మార్కాపురం, 25 గిద్దలూరు, 26న కనిగిరిలో దివ్యాంగ విద్యార్థుల కోసం ఆయా తేదీల్లో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరాల్లో పాల్గొన్నవారికి సంబంధించిన యంత్రాలను అందిస్తామని తెలిపారు.

Similar News

News August 18, 2025

ప్రకాశం జిల్లాకు కొత్తగా 26 బార్లు.. వివరాలివే.!

image

ప్రకాశం జిల్లాలో జనాభా ప్రాతిపదికన ఓపెన్ కేటగిరీలో 26 బార్లు కేటాయించనున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరిడెంట్ అయేషా బేగం సోమవారం తెలిపారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 16, మార్కాపురం మున్సిపాలిటీకి 5, చీమకుర్తి, పొదిలి, దర్శి, కనిగిరి, గిద్దలూరు మున్సిపాలిటీలకు ఒకటి చొప్పున బార్లను కేటాయించారు. ఈ బార్ల నిర్వహణ కోసం 18వ తేదీ నుంచి 26 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. 28న లాటరీ తీస్తారు.

News August 18, 2025

ప్రకాశం జిల్లాలో మరో 4లైన్ రహదారి.!

image

ప్రకాశం జిల్లా వాసుల కోసం రహదారి అభివృద్ధి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంగోలు సమీపంలోని త్రోవగుంట నుంచి కత్తిపూడి వరకు గల 250 కిలోమీటర్ల రహదారిని 4 లైన్లుగా విభజించేందుకు నేషనల్ హైవే అథారిటీ నిర్ణయించింది. నేషనల్ హైవే 216గా గుర్తించి ఈ రహదారిని 4 లైన్ల రహదారిగా మార్చనున్నారు. ఈ దారి ఒంగోలు నుంచి బాపట్ల, బాపట్ల నుంచి పెడన, పెడన నుంచి లక్ష్మీపురం, కత్తిపూడి వరకు వెళ్తుంది.

News August 18, 2025

ప్రకాశం: గిరిజన బాలికపై దాడిచేసిన చిరుత ఇదేనా?

image

ఈనెల 14న దోర్నాల (M)చిన్నారుట్ల గూడెంలో చిన్నారి అంజమ్మపై చిరుతపులి దాడి చేసిన ఘటన తెలిసిందే. నల్లమల అరణ్యం చరిత్రలో తొలిసారి ఓ వన్యప్రాణి మనుషులపై దాడి చేసిన ఘటనను అటవీశాఖ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. చిరుత కదలికలపై దృష్టి సారించేందుకు కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేయగా తాజాగా ఓ కెమెరాకు గూడెం పరిసరాల్లో తరచుగా సంచరిస్తున్న చిరుతపులి చిక్కింది. ఇది చిన్నారిపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.