News January 14, 2026
దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు… అప్లై చేశారా?

దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీలో 10 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను JAN 27వరకు స్పీడ్ పోస్ట్ చేయాలి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE, BTech, BLSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.40,000-రూ.1,40,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.deendayalport.gov.in/
Similar News
News February 6, 2026
స్మృతి.. వాట్ ఏ ఛాంపియన్

కొన్ని రోజుల క్రితమే ప్రియుడితో అనూహ్య పరిస్థితుల్లో పెళ్లి రద్దయ్యి గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు క్రికెటర్ స్మృతి మంధాన. దీనిపై పలు రకాలుగా ప్రచారం జరిగినా ఆమె పట్టించుకోలేదు. తిరిగి కొన్ని రోజులకే బ్యాట్ పట్టారు. శ్రీలంకతో సిరీస్‌లో ఫర్వాలేదనిపించినా WPLలో ఆర్సీబీ సారథిగా సత్తా చాటారు. సీజన్‌లో అత్యధిక పరుగులు చేయడమే కాకుండా ఫైనల్లో POTMగా నిలిచి అసలైన ఛాంపియన్ అనిపించుకున్నారు.
News February 6, 2026
ఫిబ్రవరి 6: చరిత్రలో ఈరోజు

✒ 1890: స్వాతంత్ర్య సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జననం ✒ 1931: సమరయోధుడు మోతిలాల్ నెహ్రూ మరణం ✒ 1932: రచయిత భమిడిపాటి రామగోపాలం జననం ✒ 1947: ప్రముఖ రచయిత్రి కె.వి.కృష్ణకుమారి జననం ✒ 1956: AP అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్ ప్రతిభా భారతి జననం ✒ 2008: హాస్యనటి కల్పనా రాయ్ మరణం ✒ 2022: సింగర్ లతా మంగేష్కర్ మరణం(ఫొటోలో)
News February 6, 2026
ఓటీటీలోకి వచ్చేసిన ‘రాజాసాబ్’

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీ అర్ధరాత్రి నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. గత నెల 9న థియేటర్లలో రిలీజైన ఈ హారర్ ఫాంటసీ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. 28 రోజుల్లోనే ఓటీటీలోకి రావడం గమనార్హం. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.


