News February 4, 2025
‘దీపం పథకం 2 పటిష్ఠంగా అమలు చేయండి’
దీపం పథకం-2 పటిష్ఠంగా అమలు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని కోర్ట్ హాల్‌లో పుట్టపర్తి పరిధిలోని గ్యాస్ ఏజెంట్స్ ప్రతినిధులతో దీపం పథకం-2 సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో అర్హులైన పేద కుటుంబాలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు.
Similar News
News February 5, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: ఫిబ్రవరి 05, బుధవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.37 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
✒ ఇష: రాత్రి 7.28 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 5, 2025
వికారాబాద్: భూ సమస్యలపై అవగాహన కల్పించుకోవాలి: కలెక్టర్
భూసమస్యలతో పాటు ఇతర సమస్యలపై అవగాహన పొంది ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతనంగా విధుల్లో చేరిన 34 మంది జూనియర్ అసిస్టెంట్‌లకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఎప్పటికప్పుడు సమస్యలపై అవగాహన కల్పించుకొని పరిణతితో ప్రజలకు చక్కగా సేవలందించాలన్నారు.
News February 5, 2025
శుభ ముహూర్తం(05-02-2025)
✒ తిథి: శుక్ల సప్తమి తె.జా.5.31 వరకు
✒ నక్షత్రం: భరణి రా.11.19 వరకు
✒ శుభ సమయం: ఏమీ లేదు
✒ రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు
✒ యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి మ.12.24 వరకు
✒ వర్జ్యం: ఉ.9.52 నుంచి 11.22 వరకు
✒ అమృత ఘడియలు: రా.7.37 నుంచి 9.06 వరకు