News October 18, 2025
దీపావళిని సురక్షితంగా జరుపుకోవాలి: కలెక్టర్

ఈ నెల 20న ప్రజలందరూ జరుపుకోబోయే దీపావళి పండుగను ఏ విధమైన ప్రమాదాలకు తావు లేకుండా జరుపుకోవాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. శనివారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన మాట్లాడారు. అనుమతులు లేదా లైసెన్సులు లేని బాణాసంచా దుకాణాల వద్ద కొనుగోలు చేయవద్దని సూచించారు. బాణసంచా సామాగ్రిని సురక్షితమైన ప్రదేశాలలో ఉంచాలన్నారు.
Similar News
News October 18, 2025
ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ.. దీపావళి కానుక ప్రకటిస్తారా?

AP: మంత్రివర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా సీఎం వారితో చర్చిస్తున్నారు. దీపావళి సందర్భంగా ప్రభుత్వం ఏదైనా కానుక అందిస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. దీనిపై కాసేపట్లో సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది.
News October 18, 2025
JNTU: Pharm.D ఫలితాలు విడుదల

అనంతపురం JNTU పరిధిలో ఆగష్టులో నిర్వహించిన Pharm.D 1, 2 సంవత్సరాల రెగ్యులర్, సప్లిమెంటరీ (R17) పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ రిలీజ్ చేశారు. ఫలితాల కోసం jntuaresults.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
News October 18, 2025
కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో 225 ఉద్యోగాలు

TG: జిల్లా–కోఆపరేటివ్ బ్యాంకుల్లో(DCCB) స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో మొత్తం 225 ఖాళీలున్నాయి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమై నవంబర్ 6న ముగియనుంది. వయసు 18-30 ఏళ్లు. డిగ్రీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. పూర్తి నోటిఫికేషన్ వివరాలకు <