News October 18, 2025

దీపావళి ఆఫర్లపై జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

image

దీపావళి పండుగ సందర్భంగా వచ్చే ఆఫర్‌లు, ప్రకటనల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. కేవలం అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే కొనుగోళ్లు జరపాలని సూచించారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా వచ్చే లింకులను తెరవవద్దని ఎస్పీ కోరారు. ఫేక్ ప్రకటనలు నమ్మి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

Similar News

News October 18, 2025

భద్రాచలం ఐటీడీఏకు జాతీయ స్థాయిలో బెస్ట్ అవార్డు

image

భద్రాచలం ఐటీడీఏకు జాతీయ స్థాయిలో ‘బెస్ట్ అవార్డు’ లభించింది. గ్రామాల అభివృద్ధిలో విశిష్ట సేవలను అందించినందుకు గాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ప్రదానం చేశారు. విజన్ 2030లో భాగంగా 130 గిరిజన గ్రామాల అభివృద్ధి, ‘ఆది కర్మయోగి అభియాన్’ అమలులో ఐటీడీఏ అద్భుత పనితీరు చూపినందుకు ఈ గౌరవం దక్కిందని ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు. ఈ అవార్డు రావడం గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

News October 18, 2025

గ్రూప్-2 అభ్యర్థులకు 48hrs ముందే దీపావళి: CM

image

TG: గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి 48 గంటల ముందే దీపావళి వచ్చిందని CM రేవంత్ అన్నారు. HYDలో వారికి నియామక పత్రాలను అందజేశారు. ‘₹లక్ష కోట్లతో కట్టిన “కాళేశ్వరం” మూడేళ్లలోనే కూలింది. గత పాలకులు వారి కుటుంబాల కోసమే ఆలోచించారు. పదేళ్లలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదు. తన ఫామ్‌హౌస్‌లో ఎకరా పంటపై ₹కోటి ఆదాయం వస్తుందన్న పెద్దాయన.. ఆ విద్యను ప్రజలకు ఎందుకివ్వలేదు’ అని ప్రశ్నించారు.

News October 18, 2025

దీపావళిని ఆనందంగా జరుపుకోవాలి: కలెక్టర్

image

ప్రజలంతా దీపావళి పండుగను సురక్షితంగా, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పర్యావరణహిత టపాసులు కాల్చడంతో వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే 101కు కాల్ చేయాలని సూచించారు.