News October 18, 2025

దీపావళి పండుగ తేదీపై స్పష్టత

image

దీపావళి, ధనలక్ష్మి పూజలను నరక చతుర్దశి రోజు, సోమవారం జరుపుకోవాలని ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం 1:55 నుంచి మంగళవారం మధ్యాహ్నం 2:59 వరకు అమావాస్య ఘడియలు ఉంటాయన్నారు. ఈ కారణంగా నోములు సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం ఆచరించవచ్చని తెలిపారు.

Similar News

News October 18, 2025

రాష్ట్రంలో 34 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>APPSC<<>> నోటిఫికేషన్ విడుదల చేసిన వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (3), రాయల్టీ ఇన్‌స్పెక్టర్ (1), వార్డెన్(1), ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్(1) పోస్టులకు అప్లై చేయడానికి ఈ నెల 28 ఆఖరు తేదీ. వెల్ఫేర్ ఆర్గనైజర్(10), జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్(7), Jr అకౌంట్(7), Sr అకౌంట్స్(4) పోస్టులకు అప్లై చేయడానికి OCT 29 చివరి తేదీ. అర్హతలు గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

News October 18, 2025

పత్తి కొనుగోళ్లు, కౌలు రైతు నమోదుపై ADB కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదు, క్రాప్ బుకింగ్, పంట నష్టం అంచనాలపై వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

News October 18, 2025

కృష్ణా: నేడే ఫైనల్.. పదవి ఎవరికి దక్కేనో..!

image

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుల ఎంపిక నేడు ఖరారు కానుంది. మధ్యాహ్నం CM ఈ నియామకాలను ప్రకటించనున్నట్లు సమాచారం. NTR నుంచి బుద్ధా వెంకన్న (BC), గన్నే వెంకటనారాయణ ప్రసాద్ (OC), కృష్ణా నుంచి కోనేరు నాని (OC), గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. MLAల మద్దతు కోనేరు నాని, బుద్ధా వెంకన్నలకు ఉన్నా, IVR కాల్స్ ఫీడ్‌బ్యాక్, నేతల అభిప్రాయాల తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.