News December 28, 2025
దీపూ దాస్ హత్యపై షాకింగ్ నిజాలు!

బంగ్లాలో దీపూ చంద్రదాస్ హత్య ఉదంతంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దీపూపై తప్పుడు నిందలు వేసి కొట్టి చంపినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు NDTVతో చెప్పారు. మృతదేహాన్ని కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లి చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారన్నారు. అసలు దీపూ ఏ మతాన్నీ విమర్శించలేదని అధికారులు తేల్చినట్లు చెప్పారు. హిందువు అనే కారణంతో, ఎదుగుతున్నాడనే అసూయతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారన్నారు.
Similar News
News December 29, 2025
4G బుల్లెట్ సూపర్ నేపియర్ గడ్డి ప్రత్యేకతలివే..

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసంలో దీనిలో తీపిదనం ఎక్కువ. దీని కాండం ముదిరినా లోపల డొల్లగా ఉండటం వల్ల పశువులు సులువుగా, ఇష్టంగా తింటాయి. ఎకరం గడ్డి 10 ఆవులకు సరిపోతుంది. దీనిలో ప్రొటీన్ కంటెంట్ 16-18 శాతంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువ. దీని వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. ఈ గడ్డి చాలా గుబురుగా, దీని ఆకులు మృదువుగా ఉండటం వల్ల రైతులు కోయడం కూడా సులభం.
News December 29, 2025
ఇవాళ, రేపు జాగ్రత్త!

TG: రాబోయే రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెల్లవారుజాము, రాత్రి వేళల్లో అవసరం అయితేనే బయటకు రావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News December 29, 2025
నేడు క్యాబినెట్ భేటీ.. జిల్లాలపై నిర్ణయం?

AP: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ప్రధానంగా జిల్లాల పునర్విభజనపై సీఎం సమీక్షించనున్నారు. అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మార్పులపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 3 కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.


