News February 25, 2025
దుద్యాల్: లగచర్ల రైతులు ఇండస్ట్రియల్ పార్కుకు సహకరిస్తున్నారు: కలెక్టర్

లగచర్ల రైతులు స్వచ్ఛందంగా ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి సహకరిస్తున్నారని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ దుద్యాల మండలం లగచర్ల ఇండస్ట్రియల్‌కు సంబంధించి తమ భూమి స్వచ్ఛందంగా ఇచ్చిన 22 మంది రైతులకు చెక్కులు పంపిణి చేశారు. భూములు ఇస్తున్న రైతులకు నష్టపరిహారాలు అందించి ప్రభుత్వం తరఫున ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు.
Similar News
News February 25, 2025
కమీషన్ల కక్కుర్తితో కంపెనీలను తరిమేశారు: స్వామి

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కమీషన్ల కక్కుర్తితో పరిశ్రమల్ని తరిమివేశారని మంత్రి స్వామి శాసన మండలిలో ధ్వజమెత్తారు. మంగళవారం మండలిలో జరిగిన గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానంలో వైసీపీ సభ్యుల వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన లూలూ, అమర్ రాజా, ఏషియన్ పార్క్ ఇండస్ట్రీ లాంటి కంపెనీలన్నింటిని తరిమి వేసిన ఘనత జగన్‌దేనని అన్నారు.
News February 25, 2025
శ్రీశైలంలో శివరాత్రి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ

శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి భద్రతా ఏర్పాట్లను కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ పరిశీలించారు. నంద్యాల ఇన్‌ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి క్షేత్ర పరిధిలో పర్యటించారు. దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్లు, ఆలయ పరిసరాలను పరిశీలించారు. సీసీ టీవీల కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
News February 25, 2025
జిల్లాను ప్రమాద రహిత పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాను ప్రమాదరహిత పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. పరవాడలో భద్రతపై మంగళవారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిశ్రమలలో తీసుకోవలసిన భద్రత చర్యల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. వాటిని తప్పకుండా పాటించాలని సూచించారు. జీరో యాక్సిడెంట్ నినాదంతో యాజమాన్యాలు పనిచేయాలని సూచించారు.