News April 16, 2025

దుబాయిలో రామారెడ్డి వాసి మృతి

image

దుబాయ్‌లో వలస కార్మికుడి మృతి చెందాడు. రామారెడ్డి మండలం రెడ్డిపేట్‌కి చెందిన బట్టు సురేశ్ దుబాయిలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఈ నెల 12న మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. దుబాయ్‌‌లో ఉన్న బట్టు శంకర్, నవీన్ ఎంబసీ ద్వారా మాట్లాడి మృతదేహాన్ని బుధవారం రాత్రి స్వగ్రామానికి పంపించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

Similar News

News November 10, 2025

నిజామాబాద్ రైతన్న.. యాసంగికి రెడీ..!

image

ఉమ్మడి NZB జిల్లాలో యాసంగి పంటల సాగుపై రైతులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడటంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో సంమృద్ధిగా నీరు వచ్చి చేరింది. శనగ, వరి మెుక్కజొన్న పంటలు ఎక్కువ మెుత్తంలో సాగయ్యే అవకాశం ఉంది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, పొచారం, కౌలాస్ నాలా ప్రాజెక్టుల ద్వారా విడతల వారీగా నీటిని అందించనున్నారు. కామారెడ్డి జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల్లో పంట సాగయ్యే అవకాశం ఉంది.

News November 10, 2025

జగిత్యాల కవయిత్రికి ‘కీర్తి’ చక్ర పురస్కారం

image

జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవయిత్రి కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ప్రధాన అడ్మిన్ మద్దెల సరోజన “జాతీయ కీర్తి చక్ర-2025” పురస్కారం అందుకున్నారు. కరీంనగర్‌లో ఆర్యాణి సకల కళా వేదిక, శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కవయిత్రి సరోజనను జగిత్యాలకు చెందిన కవులు, కళాకారులు అభినందించారు.

News November 10, 2025

జూబ్లీ బైపోల్: పోలింగ్‌ కోసం 3 వేల మంది ఉద్యోగులు

image

రేపటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ స్టేడియం వేదికగా ఈవీఎంలు, వీవీప్యాట్ల డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు(+నోటా) బరిలో ఉండగా.. 4 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు. 3 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు.