News October 9, 2025
దుబాయ్‌లో మరణించిన సోంపేట మండల వాసి

సోంపేట మండలం పాలవలస గ్రామానికి చెందిన తామాడ ఓంకార్ (21) దుబాయ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. 6 నెలలు క్రితం వలస కూలీగా దుబాయ్ వెళ్లిన ఓంకార్ ఈ నెల 3వ తేదీన మరణించినట్లు సహచర కార్మికులు ద్వారా తెలిసిందన్నారు. మృతదేహాన్ని గ్రామానికి రప్పించడానికి నాయకులు, అధికారులు సహకరించాలని కోరారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Similar News
News October 9, 2025
SKLM: ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ధాన్యం సేకరణపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగానే మండల స్థాయిలో వ్యవసాయ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. వర్షాలు పడినట్లయితే రైతులకు టార్పాలిన్లు ఇవ్వాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు.
News October 9, 2025
వ్యవసాయ శాఖ సమీక్ష సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి సచివాలయంలో గురువారం సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన వ్యవసాయ శాఖ సమీక్ష సమావేశంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. రైతు సేవా కేంద్రాలను రీ ఒరియేంటేషన్ చేసేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రైతు సేవ కేంద్రాలు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. భూసారం పెంచేలా తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని అన్నారు.
News October 9, 2025
గెస్ట్ లెక్చలర్ పోస్టుల దరఖాస్తుకు నేడే చివరి తేదీ

శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి గురువారంలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డా.కె.శ్రీరాములు ఒక ప్రకటనలో తెలిపారు. సంస్కృతం, ఒరియా సబ్జెక్టులకు గాను సంబంధిత సబ్జెక్టులలో పిజీతోపాటు PHD, నెట్, ఏపీసెట్ అర్హతలున్న అభ్యర్థులు అర్హులు అన్నారు. దరఖాస్తును కళాశాలో అందజేయాలన్నారు. ఈనెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ కళాశాలలో ఉంటుందన్నారు.