News February 27, 2025
దుబ్బరాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

సారంగాపూర్ మండలంలోని పెంబట్ల-కోనాపూర్ గ్రామంలో కొలువైన శ్రీదుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేకువజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కోడెమొక్కులు, కుంపటి గజాశూలం మొక్కులు తీర్చుకుంటున్నారు. జాతరలో భక్తులకు సరైన సౌకర్యాలు లేవని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News February 27, 2025
ఎన్టీఆర్ జిల్లాలో ముగిసిన పోలింగ్

ఎన్టీఆర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఉదయం ఎక్కువ మంది తమ ఓటును వినియోగించుకోగా మధ్యాహ్నం నుంచి మందకొడిగా సాగింది. సాయంత్రం 4 గంటల వరకు 61.99 శాతం పోలింగ్ నమోదయ్యింది. 78,063 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
News February 27, 2025
ఇళ్ల నిర్మాణంపై కీలక ఉత్తర్వులు

APలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్ శాఖ గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఆక్యుపేషన్ సర్టిఫికెట్‌పై భవన యజమానుల వద్ద అండర్ టేకింగ్ తీసుకోవాలంది. ఎప్పటికప్పుడు అధికారులు బిల్డింగ్ ప్లాన్, నిర్మాణాలు తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. ప్లాన్ మేరకు నిర్మాణం లేకపోతే నివాసయోగ్య పత్రం జారీ చేయకూడదని పేర్కొంది. ఆ పత్రం లేకపోతే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్లు, బ్యాంకులు రుణాలు ఇవ్వొద్దని తేల్చి చెప్పింది.
News February 27, 2025
పార్వతీపురం జిల్లాలో 93.94% పోలింగ్ నమోదు

పార్వతీపురం మన్యం జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 4 గంటల వరకు 93.94% పోలింగ్ శాతం నమోదైంది. ఈ మెరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 2,333 మంది ఉపాధ్యాయ ఓటర్లకు గాను 2187 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.