News October 11, 2025
దుబ్బాక ఆసుపత్రిని సందర్శించిన ASCI బృందం

దుబ్బాక ప్రభుత్వ 100 పడకల ఏరియా ఆసుపత్రిని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ASCI) బృందం శుక్రవారం సందర్శించింది. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించిన బృందం జరుగుతున్న వైద్య సేవలపై ఆరా తీసి సంబంధిత రికార్డులను పరిశీలించారు. దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు, పరిశుభ్రత సంతృప్తికరంగా ఉన్నాయని బృంద సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News October 11, 2025
HYD: GOVT ఆస్పత్రులకు వచ్చిన సహాయకులకు తప్పని కష్టాలు..!

ఉస్మానియా, గాంధీ సహా HYD సిటీలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులతో వచ్చిన అటెండర్లు ఉండడం కోసం సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పలువురు సహాయకులు వాపోయారు. అసలు సహాయకులను ఒక్కోసారి ఆసుపత్రి పక్కన సైతం పడుకోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
News October 11, 2025
సోమవారం ప్రజావాణి యథాతథం: సూర్యాపేట కలెక్టర్

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసిన నేపథ్యంలో, ఈ నెల 13న (సోమవారం) ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అమలులోకి వచ్చిన కోడ్‌ను హైకోర్టు ఆదేశాల ప్రకారం నిలిపివేశారు. ఈ మేరకు కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.