News July 9, 2024
దుబ్బాక: కూతురు ప్రేమ పెళ్లి.. తండ్రి సూసైడ్

కూతురు ప్రేమపెళ్లి చేసుకోవడంతో మనోవేదనకు గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన దుబ్బాక మండలంలో జరిగింది. SI గంగరాజ్ వివరాలు.. అచ్చుమాయిపల్లికి చెందిన సోమారపు లింగం పొలానికి వెళ్లి రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఫొన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. రాత్రి పొలం వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. కూతురు ప్రేమ వివాహంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
Similar News
News February 22, 2026
మెదక్: భరోసా కేంద్రంలో సహకారం: ఏఎస్పీ

లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలలకు భరోసా కేంద్రం ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. మెదక్ కేంద్రంలోని భరోసా కేంద్రాన్ని సందర్శించి తనిఖీ నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, సిబ్బంది విధుల నిర్వాహణ పరిశీలించారు. ఫొక్సో కేసులు, లైంగిక వేధింపుల బాధితుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు.
News February 22, 2026
మెదక్: హాజరుకానున్న 12,334 మంది విద్యార్థులు: డీఐఈవో

మెదక్ జిల్లాలో ఈనెల 25 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు.
మొత్తం విద్యార్థులు -12,334
ఫస్ట్ ఇయర్ జనరల్ -5710
ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ -599
మొత్తం -6309
సెకండ్ ఇయర్ జనరల్ -5472
సెకండ్ ఇయర్ ఒకేషనల్- 533
మొత్తం-6025
పరీక్ష కేంద్రాలు -28
ఫ్లైయింగ్ స్క్వాడ్ -5
సిట్టింగ్ స్క్వాడ్ -4
News February 22, 2026
MDK: జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నుంచి నాలుగు ప్రాజెక్టులు

కామారెడ్డి విద్యానికేతన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మెదక్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. రాష్ట్రం నుంచి జాతీయస్థాయికి ఎంపికైన 21 ప్రాజెక్టుల్లో నాలుగు మెదక్ జిల్లా నుంచే కావడం విశేషం. మహతి (వ్యర్థాల నిర్వహణ), అక్షయ్ (ఎమర్జింగ్ టెక్నాలజీ), గణేష్ (నీటి సంరక్షణ), ఆఫీఫా (వినోద భరిత గణితం) ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. కలెక్టర్ రాహుల్ రాజ్ అభినందించారు.


