News January 23, 2025
దుబ్బాక రూపురేఖలు మారుస్తా: ఎమ్మెల్యే

దుబ్బాక రూపు రేఖలు మారుస్తానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దుబ్బాక మున్సిపల్ పాలకవర్గం చివరి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దుబ్బాక పట్టణ అభివృద్ధి కోసం తానేన్నో కలలు కన్నానని దురదృష్టవశాత్తు ప్రభుత్వంలో అధికారం లేకపోవడం వలన కొంచెం అభివృద్ధిలో వెనుక పడుతున్నామన్నారు. ఎలాగైనా తగినన్ని నిధులు తీసుకొచ్చి దుబ్బాక పట్టణ రూపురేఖలు మార్చుతానని తెలిపారు.
Similar News
News November 10, 2025
ఫెదరర్ రికార్డును దాటేసిన జకోవిచ్

టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ సంచలనం సృష్టించారు. ఏథెన్స్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచి కెరీర్‌లో 101వ సింగిల్స్ టైటిల్ అందుకున్నారు. ఇటలీ ప్లేయర్ ముసెట్టితో జరిగిన ఫైనల్లో 4-6, 6-3, 7-5 తేడాతో విజయం సాధించారు. దీంతో హార్డ్ కోర్టులపై జకోవిచ్ సాధించిన టైటిల్స్ సంఖ్య 72కు చేరింది. పురుషుల సింగిల్స్‌లో ఇదే అత్యధికం. తర్వాతి స్థానంలో ఫెదరర్(71) ఉన్నారు.
News November 10, 2025
ఏటూరునాగారంలో 80 రకాల సీతాకోక చిలుకలు

తెలంగాణలో 140 రకాల సీతాకోక చిలుకలు ఉంటే ఒక్క ఏటూరునాగారం అభయారణ్యంలోనే 80 రకాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. వీటిలో స్పార్టెడ్ యాంగిల్, స్మాల్ ప్లాట్, రెడ్ఐ, గ్రిజ్ల్ స్కిప్పర్, బ్లాక్ రాజా, టాని రాజా, ఓక్ బ్లూ, నవాబ్ వంటి అరుదైన రకాలు ఉన్నట్లు గుర్తించారు. పర్యావరణ సమతుల్యతలో సీతాకోక చిలుకలు కీలక పాత్ర పోషిస్తాయని, వాటి మానుగడ నిర్ధారించడానికి మరిన్ని సర్వేలు జరగాల్సి ఉందని డీఎఫ్ఓ జాదవ్ అన్నారు.
News November 10, 2025
అయిజ: పత్తి రైతులకు స్లాట్ బుకింగ్ అవకాశం

గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలలో నవంబర్ 17న పత్తి విక్రయించేందుకు రైతులు సోమవారం ఉదయం 8:30 నుంచి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని అయిజ ఏఓ జనార్ధన్ తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న రైతులు 17న గద్వాల బాలాజీ కాటన్ మిల్ లేదా అలంపూర్ వరసిద్ధి వినాయక కాటన్ మిల్స్‌లో పత్తి విక్రయించుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


