News February 8, 2025
దుమ్మగూడెం : పురుగు మందు తాగి బాలిక మృతి

దుమ్మగూడెం మండల పరిధిలోని ధర్మవరం కొత్తగూడెంకి చెందిన ఓ మైనర్ బాలిక చదువు మధ్యలో మానేసి ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు చదువుకోమని మందలిస్తుండేవారు. ఈ క్రమంలో గత నెల 26న ఆమె తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నోటి నుంచి నురగతో పడిపొయి ఉంది. బాలికను ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది.
Similar News
News February 27, 2026
నానో ఎరువులను ఎప్పుడు పిచికారీ చేయాలి?

వరిలో నానో యూరియా, నానో DAPలను కలిపి పిలకలు తొడిగే దశలో, చిరు పొట్ట దశలో పిచికారీ చేసుకోవచ్చు. కూరగాయలు, పప్పు దినుసుల పంటల్లో మొక్కల రెమ్మలు వచ్చే దశ, పూత దశలో స్ప్రే చేసుకోవచ్చు. పండ్ల తోటల్లో మామిడి పూతకు ముందు డిసెంబరు నెలలో నానో DAP స్ప్రే చేయడం వల్ల పూత పెరిగి మంచి దిగుబడులు వచ్చాయని రైతులు చెబుతున్నారు. కాబట్టి పండ్ల తోటల్లో పూతకు ముందు నానో DAPని పిచికారీ చేసి మంచి ఫలితాలను పొందవచ్చు.
News February 27, 2026
ఇండియన్ ఆర్మీలో JAG ఎంట్రీ స్కీమ్.. అప్లై చేశారా?

<
News February 27, 2026
KNR: అగ్రనేతల లొంగుబాటు.. మావోలకు ‘చెక్’ పడినట్లేనా?

2026 మార్చి 31కి దేశాన్ని నక్సల్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం గడువు విధించుకుంది. ఇప్పటికే ఉమ్మడి KNR జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు దేవ్ జీ, మల్ల రాజిరెడ్డి లొంగిపోయారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో కుల వివాదంతో చిన్నారి మృతి చెందడం, ఎరువుల కోసం రైతులు ఇబ్బందులకు గురికావడం వంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో నక్సలిజం కొనసాగుతుందా? లేక కేంద్రం చెక్ పెడుతుందా అన్న విషయం చర్చనీయాంశమైంది.


