News April 16, 2025
దుమ్ముగూడెం: మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు

ఆదివాసీ యువజన సంఘం పేరుతో మంగళవారం దుమ్ముగూడెం మండలంలో పలుచోట్ల కరపత్రాలు వెలిశాయి. గోవిందపురం, పెద్ద బండి రేవు, చిన్ననలబల్లి, ములకపాడు, లక్ష్మీనగరం ప్రధాన సెంటర్లలో వెలసిన కరపత్రాలలో గిరిజనులకు ఆధారమైన అడవిలోకి వెళ్లకుండా మావోయిస్టులు బాంబులు అమర్చడం సరైన పద్ధతి కాదని ఎంతకాలం ఈ అరాచకాలు, మమ్మల్ని అభివృద్ధి చెందనివ్వరా అంటూ ప్రశ్నిస్తూ కరపత్రాలలో పేర్కొన్నారు.
Similar News
News April 17, 2025
సిద్దిపేట: ‘1100 ఏళ్ల నాటి జైన విగ్రహాన్ని కాపాడుకోవాలి’

నంగునూరు మండలం చిన్నకొండ పైన ఉన్న జైన విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్,సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద విగ్రహంగా పేరు ఉన్న జైన విగ్రహాన్ని బుధవారం ఆయన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులతో కలిసి పరిశీలించారు.1100 సంవత్సరాల చరిత్ర గల జైన విగ్రహాన్ని ప్రభుత్వం పట్టించుకుని పర్యాటక కేంద్రం చేయాలన్నారు.
News April 17, 2025
విశాఖ: సమతా ఎక్స్ ప్రెస్ రద్దు

నాగపూర్ డివిజన్‌లో ఇంటర్ లాకింగ్ పనులు వలన విశాఖ నుంచి బయలుదేరే పలు రైలు రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ బుధవారం తెలిపారు. ఈ మేరకు విశాఖ- నిజాముద్దిన్ సమతా ఎక్స్‌ప్రెస్ (12807/12808) ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు.
News April 17, 2025
VKB: సన్న బియ్యంపై అసత్య ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు: కలెక్టర్

రేషన్‌లో ప్లాస్టిక్ బియ్యం సరఫరా అనే ప్రచారంలో వాస్తవం లేదని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. జిల్లాలో అసత్య ప్రచారాలు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం పంపిణీ చేసే సన్న బియ్యం పోర్టీపైడ్ రైస్(Fortified Rice- విటమిన్స్)తో కూడుకున్న బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు.