News December 18, 2024
దురాజ్‌పల్లి (పెద్దగట్టు) జాతర ఎప్పుడంటే..?
తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందింది సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి లింగమంతుల స్వామి జాతర. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. 2025 ఫిబ్రవరి 2న దిష్టి పూజ నిర్వహించి, 16 నుంచి 20వ తేదీ వరకు జాతర నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల నుంచి భక్తులు తరలివస్తారు.
Similar News
News February 5, 2025
NLG: 33 జడ్పీటీసీలు.. 352కు చేరిన ఎంపీసీటీలు!
2016లో జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లాలో 31 మండలాలు ఉండగా వాటి పరిధిలో 31 జడ్పీటీసీ, 349 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. ఆ తర్వాత జిల్లాలో రెండు మండలాలను పెంచారు. గట్టుప్పల్, గుడిపల్లి మండలాలు ఏర్పడడంతో మండలాల సంఖ్య 33కు పెరిగింది. దీంతో జడ్పీటీసీలు కూడా 33 కానున్నాయి. ఎంపీటీసీల పునర్విభజన చేపట్టడంతో మూడు ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. దీంతో ఎంపీటీసీల సంఖ్య 352కు చేరింది.
News February 5, 2025
NLG: పరిషత్తు.. కసరత్తు
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. తాజాగా మండల జిల్లా పరిషత్ ఎన్నికలే మొదట నిర్వహిస్తామని చెబుతుండటంతో యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తుంది. జిల్లాలో 33 జడ్పీటీసీలు, 352 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న GP ఓటర్ల జాబితా ఆధారంగా ఎంపీటీసీ ఓటర్ల జాబితాను తయారు చేయనున్నారు.
News February 5, 2025
ఈనెల 7న బుద్ధవనంలో ‘త్రిపీటక పఠనోత్సవం’
నాగార్జునసాగర్ హిల్ కాలనీ బుద్ధవనంలో ఈనెల 7న మహాబోధి సొసైటీ సికింద్రాబాద్, అంతర్జాతీయ త్రిపీటక సంగాయన మండలి ఆధ్వర్యంలో త్రిపీటక పఠనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా బౌద్ధ ధార్మిక సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణ కోసం నిర్వహించే కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన 200 మంది బౌద్ధ బిక్షువులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.