News September 21, 2025
దుర్గగుడికి తక్కువ సామానుతో రండి: కలెక్టర్

దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గ గుడికి వచ్చే భక్తులు తక్కువ సామానుతో రావాలని NTR కలెక్టర్ లక్ష్మీశా కోరారు. భక్తులు తమ వ్యక్తిగత వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని, నిర్దేశించిన క్యూలైన్లలో మాత్రమే అమ్మవారి దర్శనానికి రావాలని ఆయన సూచించారు. వృద్ధులు, పసిపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News September 21, 2025
సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు: డీఈవో

దసరా సెలవుల్లో ప్రత్యేకత తరగతుల పేరుతో విద్యార్థులను పాఠశాలలకు పోయించుకుంటే కఠిన చర్యలు తప్పవని డీఈవో శామ్యూల్ పాల్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే పలు పాఠశాలలపై ఫిర్యాదుల వచ్చాయన్నారు. విద్యాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, పాఠశాలను మూసివేయిస్తారని హెచ్చరించారు.
News September 21, 2025
పాతబస్తీ పనుల్లో వేగం పెంచండి: మెట్రో MD

HYD మెట్రో రైల్ ప్రాజెక్టుపై HMRL ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మెట్రో మొదటి దశ, ముఖ్యంగా పాత నగరంలో పనులను వేగవంతం చేయాలని, సవాళ్లను అధిగమించేందుకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మెట్రో 2వ దశ ప్రాజెక్టునూ సమీక్షిస్తూ, సీఎం మార్గదర్శనంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
News September 21, 2025
ఆరోగ్యశ్రీతో NIMSలో ఉచిత గుండె శస్త్రచికిత్సలు

NIMSలో సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు 4వ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ శిబిరం విజయవంతంగా పూర్తైంది. డా.రమణ, డా.ఎం.అమరేశ్ రావు ఆధ్వర్యంలో 22 మంది చిన్నారులకు క్లిష్టమైన గుండె ఆపరేషన్లు చేశారు. ఇందులో రష్యా, యూకే, భారత్‌కు చెందిన వైద్య నిపుణులు కలిసి సేవలందించారు. 500 మందికిపైగా రోగులు వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్సలు అందించారు.