News December 27, 2025
దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడికి విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.3.08 కోట్లుగా ఉన్నాయని పేర్కొంటూ ఏపీసీపీడీసీఎల్ అధికారులు హెచ్‌టీ లైన్ నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. 2023 ఫిబ్రవరి నుంచి బిల్లులు చెల్లించలేదని, నోటీసులకు స్పందన లేకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. అయితే భక్తులకు ఇబ్బందులు లేకుండా జనరేటర్లు, సోలార్ విద్యుత్‌తో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Similar News
News February 22, 2026
కొత్తకోట: గుప్త నిధుల పేరిట మోసం.. ఇద్దరి అరెస్ట్

గుప్తనిధులు ఉన్నాయని నమ్మించి రూ.40 లక్షలు వసూలు చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ముందుగా పాతిపెట్టిన లక్ష్మీదేవి విగ్రహాన్ని తవ్వి, కోట్ల రూపాయల విలువ ఉందని నమ్మించి బాధితుడిని మోసం చేసినట్లు వివరించారు. ఈ కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని.. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామన్నారు.
News February 22, 2026
ఎక్స్‌గ్రేషియా నిధుల విడుదల

AP: మత్స్యకారుల కుటుంబాలకు సంబంధించి కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా నిధులను విడుదల చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 95 మంది కుటుంబాలకు మొత్తం రూ.4.75 కోట్లు రిలీజ్ చేసినట్లు వివరించారు. 90 మంది కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసినట్లు వెల్లడించారు. సాంకేతిక కారణాలతో ఆగిన మిగతా 5 కుటుంబాలకు త్వరలోనే సాయం అందుతుందని మంత్రి చెప్పారు.
News February 22, 2026
HYDలో కొత్త కిక్.. పక్కా HOME VIBE

HYDలో రంజాన్ సీజన్ కిక్కే వేరబ్బా! హోటల్‌లో మసాలా ఫుడ్‌కి బై చెప్పి, సిటీ జనం ఇప్పుడు ‘హోమ్ చెఫ్స్’ వైపు మొగ్గు చూపుతున్నారు. సిటీలో ముఖ్యంగా బంజారాహిల్స్, టోలిచౌకి గల్లీల్లో మహిళలు వండే ఖిచిడీ- ఖీమా, దమ్‌కా ముర్గ్ ఇప్పుడు హాట్‌గా లాగిస్తున్నారు. పబ్లిసిటీ లేకున్నా, వాట్సాప్ గ్రూపుల్లో ‘సీక్రెట్ కిచెన్’ ఆర్డర్లు నడుస్తున్నాయి. హోటల్ గందరగోళం లేకుండా, గట్ థ్యాంక్స్ చెప్పే అచ్చమైన ఇంటి రుచి ఇది!


