News September 21, 2025
దుర్గగుడిలో భక్తులకు క్యూఆర్ కోడ్ సేవలు: కలెక్టర్

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గగుడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అమ్మవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, హోల్డింగ్ ప్రాంతాలు, 1.8కి.మీ పొడవున ఉన్న క్యూలైన్‌లలో ప్రతి 100 మీటర్లకు క్యూఆర్ కోడ్ పోస్టర్‌లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు ఈ కోడ్ స్కాన్ చేసి, ఉత్సవాల ఏర్పాట్లపై తమ అభిప్రాయాలను, సమస్యలను తెలియజేయవచ్చని చెప్పారు.
Similar News
News September 21, 2025
GWL: పేదరికం జయించి.. మెడికల్ సీట్లు సాధించి

భవిష్యత్తులో స్థిరపడాలంటే చదువు చాలా ముఖ్యమని పెరేంట్స్ చిన్నప్పటి నుంచి పదే పదే చెప్పడం, వారి ఆశయాలను నెరవేర్చాలని సంకల్పంతో మెడికల్ సీట్లను చాలామంది విద్యార్థులు సాధించారు. పేదరికాన్ని జయించి సత్తా చాటుకున్నారు. మానోపాడు మండలంలో ముగ్గురు మెడికల్ సీట్లు సాధించారు. జల్లాపురం రక్షిత (మంచిర్యాల) కొర్విపాడు ఎండీ షాహిద్ బాషా (వరంగల్) నారాయణపురం పల్లి జ్ఞానేశ్వర్ రెడ్డి సంగారెడ్డిలో సీట్లు సంపాదించారు.
News September 21, 2025
KNR: ఒక్కోమహిళకు రూ.50వేలు.. రూ.లక్ష స్కూటీ!

ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద వ్యాపారాల కోసం ఒక్కోమహిళ రూ.50,000 పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని KNR మైనారిటీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు కోరారు. అలాగే రేవంతన్న కా సహారా స్కీంలో భాగంగా అందించే రూ.లక్ష విలువగల మోపెడ్(స్కూటీ) వాహనాలు పొందేందుకు tgobmms.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో APPLY చేసుకోవాలన్నారు. ఇందుకు చివరితేదీ OCT 6 అని, మరిన్ని వివరాలకు 0878-2957085ను సంప్రదించాలన్నారు. #SHARE IT.
News September 21, 2025
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు ప్రభుత్వం వ్యతిరేకం: ఉత్తమ్

TG: కర్ణాటకలోని కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. ‘ఈ డ్యాంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. నేను రేపు ఢిల్లీకి వెళ్తా. ఆల్మట్టి ఎత్తు పెంపుపై వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. దానిపై విచారణ జరుగుతోంది. ఎంతటివారైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు.