News August 15, 2025
దుల్ల గ్రామంలో విషాద ఛాయలు

రామభద్రపురం వద్ద చెట్టు పడి <<17400517>>గురువారం<<>> మృతి చెందిన శ్రీనివాస్ స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా దుల్ల గ్రామంలో విషాదఛాయలు నెలకున్నాయి. శ్రీనివాస్‌కు వివాహం అయి రెండేళ్లయింది. డెక్కన్ ఫ్యాక్టరీలో ఉద్యోగం రావడంతో భార్యతో కలిసి తునిలో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ తల్లిదండ్రులకు ఇద్దరు ఆడపిల్లలు, ఇతను ఒక్కడే కుమారుడు. ఉద్యోగానికి వెళ్లి విగతజీవిగా మారిన కుమారుడ్ని చూసి వారు కన్నీరు మున్నీరువుతున్నారు.
Similar News
News August 16, 2025
రాజమండ్రి: విద్యుత్ శాఖ శకటానికి ప్రథమ స్థానం

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మొత్తం 12 శకటాలు పాల్గొన్న ఈ ప్రదర్శనలో, విద్యుత్ సంస్థ శకటం మొదటి స్థానం దక్కించుకుంది. వ్యవసాయం, ఉద్యానవన శాఖల శకటాలు రెండవ స్థానం, సాంఘిక సంక్షేమ శాఖ శకటం మూడవ స్థానం పొందాయి. అలాగే, పశు సంవర్థక శాఖ శకటం నాలుగవ స్థానం, పర్యాటక శాఖ శకటం ఐదవ స్థానం సాధించాయి.
News August 15, 2025
రాజమండ్రి: విద్యుత్ శాఖ శకటానికే ప్రథమ స్థానం

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మొత్తం 12 శకటాలు పాల్గొన్న ఈ ప్రదర్శనలో, విద్యుత్ సంస్థ శకటం మొదటి స్థానం దక్కించుకుంది. వ్యవసాయం, ఉద్యానవన శాఖల శకటాలు రెండవ స్థానం, సాంఘిక సంక్షేమ శాఖ శకటం మూడవ స్థానం పొందాయి. అలాగే, పశు సంవర్థక శాఖ శకటం నాలుగవ స్థానం, పర్యాటక శాఖ శకటం ఐదవ స్థానం సాధించాయి.
News August 15, 2025
దేశభక్తుల ప్రాణత్యాగమే నేటి స్వాతంత్రం: ఎమ్మెల్సీ సోము

ఎందరో దేశభక్తులు త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్ర్యం అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన “విభజన్ క విభీషక్ దివస్” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తూ పుష్కర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సమరయోధుల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.