News April 15, 2025
దువ్వాడ: రైలులో ప్రసవించిన మహిళ

చర్లపల్లి నుంచి కిసాన్ గంజ్ (07046) రైల్లులో ప్రయాణిస్తున్న మహిళ ఆదివారం అర్ధరాత్రి 12:30కు దువ్వాడ సమీపంలో ప్రసవించింది. రైలులో ఉన్న జైనాబ్‌కు పురిటి నొప్పులు రావడంతో రైల్వే సిబ్బంది గమనించి సత్వర చర్యలు చేపట్టారు. ఆమె రైలులోనే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తక్షణమే తర్వాత స్టేషన్లో హాస్పిటల్‌కి తరలించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు.
Similar News
News April 16, 2025
విశాఖ: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

విశాఖలో ఇంటర్ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన వేదాంత కార్తికేయ మారికవలస ఓజోన్ వ్యాలీలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరాడు. బుధవారం ఉదయం హస్టల్ గదిలో ఉరివేసుకొని చనిపోయాడు. మృతదేహాన్ని విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వీరి స్వగ్రామం విజయనగరం జిల్లా గరివిడి అని కాలేజీ సిబ్బంది తెలిపారు.
News April 16, 2025
భీమిలి: కన్నకూతురిపై తండ్రి అత్యాచారం

విశాఖలో మంగళవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కూతురి పట్ల కీచకుడిగా మారాడు. షిప్పింగ్ యార్డ్ ప్రాంతానికి చెందిన అప్పన్న మద్యం మత్తులో తగరపువలసలోని ఓ కాలేజీ ఎదురుగా ఉన్న షాపులో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అడ్డుపడి భీమిలి పోలీసులకు అప్పగించారు. బాలికను చికిత్స నిమిత్తం KGHకి తరలించారు. మహిళ స్టేషన్ ఏసీపీ పెంటా రావు సంఘటన స్థలాన్ని బుధవారం పరిశీలించారు.
News April 16, 2025
విశాఖ: దివీస్ ఉద్యోగి మృతి

దివీస్‌లో పనిచేస్తున్న మధు మోహాన్ మంగళవారం మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా ముక్కామల గ్రామానికి చెందిన మోహన్ దివీస్‌లో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని హాస్టల్‌కి వచ్చాడు. అర్ధరాత్రి ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేశారు.