News August 13, 2024

దువ్వాడ వివాదం.. చర్చలు విఫలం

image

టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణి కుటుంబసభ్యులు సోమవారం రాత్రి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దువ్వాడ తరఫున ఆయన సోదరుడు శ్రీధర్, వాణి తరఫున ఆమె సోదరి చర్చల్లో పాల్గొనగా అర్ధాంతరంగా ముగిశాయి. వారు నేడు మరోసారి సమావేశమై వివాదం సద్దుమణిగేలా చర్చలు జరపనున్నట్లు సమాచారం. వాణి డిమాండ్లపై నేడు చర్చించే అవకాశం ఉంది.

Similar News

News November 3, 2025

శ్రీకూర్మంలో బండి ఎక్కిన పడవ

image

గార(M) శ్రీకూర్మనాథ స్వామి ఆలయం సమీపంలో ఆదివారం పడవను పోలిన బండిని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా వేటకు వెళ్లని మత్స్యకారులు నావలకు రిపేర్లు చేయించారు. సాయంత్రం పడవను నాటు బండిపై ఎక్కించుకొని తీసుకుని వెళ్లిన దృశ్యాన్ని చూసేయండి.

News November 3, 2025

నేడు శ్రీకాకుళంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

image

నేడు (నవంబర్ 3న) ప్రజా ఫిర్యాదులు నమోదు మరియు పరిష్కార వేదిక, శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. https://Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో అర్జీదారులు తమ ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. వినతులు సమర్పించిన అనంతరం వాటి స్థితిని తెలుసుకొనేందుకు 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.

News November 2, 2025

SKLM: ఒక్కొక్కరికి రూ.17లక్షల పరిహారం

image

కాశీబుగ్గ వేంకన్న ఘటన నేపథ్యంలో ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు రూ.15లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. అలాగే కేంద్రం మృతుల కుటుంబానికి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ప్రకటించింది. మొత్తంగా చనిపోయిన కుటుంబానికి రూ.17లక్షలు, గాయపడిన వారికి రూ.3.50లక్షల అందనుంది. మృతుల్లో TDP కార్యకర్తలు ఉండటంతో రూ.5లక్షల చొప్పున ఇన్సురెన్స్ రానుంది.