News August 26, 2024
దువ్వూరు: చికిత్స పొందుతూ చిన్నారి మృతి

దువ్వూరు మండలం చింతకుంట గ్రామం వద్ద జాతీయ రహదారిపై సోమవారం కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కర్నూలు కొత్తపేటకు చెందిన భగత్ సింగ్ తన కూతురు కియాన్ సింగ్ పుట్టు వెంట్రుకలకు తిరుమలకు కారులో 9 మంది బయలుదేరారు. చింతకుంట వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడటంతో గాయపడ్డారు. మైదుకూరు ఆసుపత్రిలో నాగలక్ష్మి(70), భగత్ సింగ్(35), ప్రొద్దుటూరు ఆస్పత్రిలో కియాన్ సింగ్(9 నెలలు) చికిత్స పొందుతూ చనిపోయారు.
Similar News
News February 25, 2026
27న వైవీయూలో జాబ్ మేళా: ప్రిన్సిపల్

కడప YVUలో ఈ నెల 27వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ప్రొ. టి. శ్రీనివాస్ తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, వైవీయు ప్లేస్మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. 13 కంపెనీలు విశ్వవిద్యాలయానికి వస్తున్నాయన్నారు. టెన్త్ నుంచి పీజీ చదివిన వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 6300125455, 94405 16153 నంబర్లను సంప్రదించాలన్నారు.
News February 25, 2026
కడప జిల్లాలో పలువురు ఆర్డీవోల బదిలీ

కడప జిల్లాలో పనిచేస్తున్న పలువురు గ్రూప్-1 అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కడప కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప ఆర్డీవో జాన్ అవిన్, జమ్మలమడుగు ఆర్డీవో ఆదిమూలం సాయిశ్రీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
News February 25, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,780
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,518
* వెండి 10 గ్రాముల ధర రూ.2,762.


