News January 27, 2025
దువ్వూరు హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా
కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద జాతీయ రహదారిపై ఓ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల వివరాల ప్రకారం, డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలానికి దువ్వూరు ఎస్‌ఐ వినోద్, పోలీసులు చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News January 27, 2025
కాశినాయన: గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ భర్త మరణం
కాశినాయన మండలం వరికుంట్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ అల్లూరమ్మ భర్త చిన్న ఓబులేసు సోమవారం ఉదయం వరంగల్‌లో మరణించారు. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కుర్చీలో కూర్చుని ఉండగా హార్ట్ అటాక్ వచ్చి మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తదనంతరం వరంగల్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఓబులేసు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News January 27, 2025
కడప: గణతంత్ర వేడుకల్లో బహుమతులు వచ్చింది వీటికే
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు గెలుపొందిన శకటాల వివరాలు. మొదటి బహుమతిగా డీపీవో, జడ్పీ, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, జిల్లా నీటి యాజమాన్య సంస్థలకు లభించింది. రెండవ బహుమతిగా వ్యవసాయం, మత్య్స శాఖ, పశు సంవర్థక శాఖలకు లభించింది. మూడవ బహుమతిగా కడప మున్సిపల్ కార్పోరేషన్‌కు లభించింది. 4వది ప్రోత్సహక బహుమతిగా సీపీవో, డీఆర్డీఏ, హౌసింగ్, ఎల్డీఎం, ఎస్బీఐలకు లభించింది.
News January 26, 2025
కడప: చాక్ పీస్‌పై జాతీయ జెండా
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కడప నగరానికి చెందిన ఓ యువకుడు తన ప్రతిభను చాటాడు. చాక్ పీస్‌పై జాతీయ జెండాను రూపొందించి తనలో ఉన్న ప్రతిభను చాటి చెప్పాడు. కడప నగరం చిన్నచౌక్ ప్రాంతానికి చెందిన సాయి చరణ్ క్యూబిక్‌లో ప్రతిభతో పాటు పెన్సిల్, చాక్ పీస్‌పై వివిధ రకాల ఆర్ట్ వేస్తూ అబ్బుర పరుస్తూ ఉంటాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చాక్ పీస్‌పై ఆర్ట్ వేయడంతో పలువురు అభినందిస్తున్నారు.