News January 27, 2025
దుశ్చర్లకు గవర్నర్ పురస్కారం

జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ గౌడ్‌కు పర్యావరణ విభాగంలో గవర్నర్ ప్రతిభా పురస్కారాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అందించారు. కాగా దుశ్చర్ల మోతె మండలం రాఘవాపురంలో తనకున్న 70 ఎకరాల భూమిలో అడవిని సృష్టించాడు. దుశ్చర్లకు అవార్డు రావడం పట్ల ప్రకృతి ప్రేమికులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News September 17, 2025
ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా పనితీరు ఉండాలి: లక్ష్మీశా

ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆర్‌డీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుల ఆదాయాలను పెంచడానికి దోహదపడే ఉద్యానవన, పశుసంవర్థక రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
News September 17, 2025
సద్దుల బతుకమ్మ-దసరా వేడుకలపై మంత్రి కొండా సమీక్ష

వరంగల్‌లో నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ-దసరా వేడుకలపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. రంగలీల మైదానంలో జరుగనున్న ఉత్సవాల ఏర్పాట్లపై మేయర్, పోలీస్ కమిషనర్, బల్దియా కమిషనర్‌తో ఆమె చర్చించారు. వేడుకలను ఘనంగా, సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ వేడుకలు ప్రజలందరికీ ఆహ్లాదకరంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
News September 17, 2025
పేట్ల బురుజులో పోలీసుల శిశు సంరక్షణ కేంద్రం

మహిళా పోలీసుల కోసం నూతన శిశు సంరక్షణ కేంద్రాన్ని నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ బుధవారం ప్రారంభించారు. పేట్లబురుజులోని సీఏఆర్ ప్రధాన కార్యాలయంలో మహిళా పోలీసు అధికారుల పిల్లల కోసం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. 150-200 మంది పిల్లలకు ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. మహిళా ఉద్యోగులు తమ పిల్లలను డ్యూటీ ప్రదేశానికి తీసుకువస్తే వారి సంరక్షణకు ఈ కేంద్రం ఎంతో భరోసా ఇస్తుందన్నారు.