News August 30, 2025
దుష్ప్రచారం చేయడం తగదు: KMR MLA

వరద సమయంలో అధికారులతో పాటు తాను పని చేసిన పని చేయలేదని దుష్ప్రచారం చేయడం తగదని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం ఆయన కామారెడ్డిలో మాట్లాడారు. ఎవరు ఊహించని విధంగా వర్షం పడటంతో వరదలు వచ్చాయన్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండటంతో ప్రాణ నష్టం జరగలేదన్నారు. పట్టణంలో కలెక్టరేట్ తప్ప అన్ని కాలనీలో భారీగా వరద నీరు వచ్చిందన్నారు. వరదలతో నియోజకవర్గానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు.
Similar News
News August 31, 2025
ఏటీఎంలలో చోరీ.. యూపీ ముఠా అరెస్ట్: సీఐ

పరవాడ ప్రాంతాల్లో ఏటీఎంలలో చోరీలకు పాల్పడిన యూపీకి చెందిన ముగ్గురిని శనివారం అరెస్టు చేసినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. ఈనెల 27న నిందితులు పరవాడ,దేశపాత్రునిపాలెం ఏటీఎంలలో డూప్లికేట్ తాళాలతో సేఫ్ డోర్ తెరిచి డిస్పెన్సర్ డోర్ వద్ద స్టిక్కర్లు అతికించారు. కస్టమర్లు విత్ డ్రా చేసిన నగదు బయటకు రాకుండా అందులో ఉండిపోయింది. తర్వాత నిందితులు ఏటీఎంలలోకి ప్రవేశించి నగదు తీసుకున్నారు.
News August 31, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఆందోళన!

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు <<17568780>>సన్నాహకాలు<<>> మొదలయ్యాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. కొందరు ఇప్పుడిప్పుడే పనులు స్టార్ట్ చేస్తుండగా, మరికొందరివి చివరి దశకు చేరుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పథకానికి బ్రేక్ పడుతుందేమో? డబ్బులు రాకపోతే నిర్మాణమెలా? అన్న సందేహాలతో సతమతమవుతున్నారు. అయితే ఆందోళన అవసరం లేదని, ఎన్నికల తర్వాత కూడా పథకం కొనసాగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
News August 31, 2025
VZM: నేడు జిల్లాకి రానున్న గోవా గవర్నర్

గవర్నర్ హోదాలో పూసపాటి అశోక్ గజపతిరాజు తొలిసారి జిల్లాకు రానున్నారు. మూడు రోజులు పాటు జిల్లాలో ఉంటారు. సెప్టెంబర్ 1న శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంటారు. 2వ తేదిన కోటలోని మోతీమహల్‌ను ప్రారంభిస్తారు. 3వ తేదిన సింహాచలం శ్రీవరహాలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని, 4న గోవాకు తిరుగు పయనమవుతారని అశోక్ బంగ్లా వర్గాలు వెల్లడించాయి.