News April 9, 2024

‘దుస్తులను ఇస్త్రీ చేసిన ఆత్మకూరు ఎమ్మెల్యే’

image

ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సోమవారం రాత్రి ఆత్మకూరు పట్టణంలో పర్యటించారు. అనంతరం పట్టణంలోని 6వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా దుస్తులను ఇస్త్రీ చేశారు. స్థానికులతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Similar News

News March 15, 2025

రౌడీ షీటర్ దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ నెల్లూరు

image

నెల్లూరు నగరం పాత వేదయపాలెంకు చెందిన రౌడీ షీటర్ సృజన్ కృష్ణ (చింటూ)ను అత్యంత కిరాతకంగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో హత్య చేశారు. ఈ హత్య వెనుక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ తరలించారు. హత్యకు గల కారణాలపై వేదాయపాలెం ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి సాంకేతిక పరిశోధనతో పాటు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

News March 14, 2025

నెల్లూరులో దారుణ హత్య

image

నెల్లూరు దారుణ హత్య చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని  దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. గతంలో రామలింగపురం అండర్ బ్రిడ్జి దగ్గర జరిగిన కత్తి రవి హత్య కేసులో ఉన్న చింటూగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 14, 2025

హోలీ పండుగ.. నెల్లూరు SP కీలక ఆదేశాలు 

image

నెల్లూరు జిల్లా ప్రజలకు SP జి.కృష్ణకాంత్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ ప్రేమ, ఐక్యత, సంతోషాన్ని తెచ్చిపెట్టాలని ఆయన కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ మత సామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో పండగ నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. హద్దు మీరితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

error: Content is protected !!