News January 14, 2026
దూడల్లో నట్టల బెడద – ఈ జాగ్రత్తలు తీసుకోండి

దూడలకు నట్టల బెడద సర్వసాధారణం. ఈ సమస్య గేదె దూడలలో ఎక్కువగా వస్తుంది. దూడల్లో నట్టల సమస్య ఉంటే వాటికి తరచూ విరేచనాలు అయ్యి దూడ పెరుగుదల సక్రమంగా ఉండదు. వెంట్రుకలు బిరుసుగా ఉండి, నడుము కిందికి జారి ఉంటుంది. దవడల మధ్య నీరు చేరుతుంది. ఈ సమస్య కట్టడికి దూడ పుట్టిన ఎనిమిది రోజులలో తొలిసారి, తర్వాత ప్రతి నెలకు ఒకసారి చొప్పున ఆరు నెలల వయసు వచ్చేవరకు వెటర్నరీ నిపుణుల సూచనలతో నట్టల మందు తాగించాలి.
Similar News
News January 28, 2026
టేబుల్‌టాప్ రన్‌వేలు ఎందుకు డేంజరస్?

* పీఠభూమి/కొండపై రన్‌వేతో 2 వైపులా లోయలు ఉండటం.
* రన్‌వే హారిజాంటల్‌గా, తక్కువ దూరం ఉన్నట్టు కనిపించడం.
* బ్రేకింగ్, గో అరౌండ్‌కు రన్‌వే పొడవు తక్కువగా ఉండటం.
* ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో అకాల వర్షం, టైల్‌విండ్, తక్కువ విజిబిలిటీతో ల్యాండింగ్.
* పైలట్లు తప్పుగా అంచనా వేసి ఓవర్‌షూట్/అండర్‌షూట్ చేసే ఛాన్స్.
* ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టం వంటి అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ సపోర్ట్ లేకపోవడం.
News January 28, 2026
న్యూజిలాండ్ భారీ స్కోర్

విశాఖలో భారత్‌తో జరుగుతున్న 4వ టీ20లో న్యూజిలాండ్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఓపెనర్లు సీఫర్ట్(62), కాన్వే(44) విజృంభించారు. ఫిలిప్స్ 24 పరుగులతో రాణించారు. చివర్లో మిచెల్(39*) వేగంగా పరుగులు రాబట్టారు. అర్ష్‌దీప్, కుల్దీప్ చెరో 2, రవి బిష్ణోయ్, బుమ్రా తలో వికెట్ తీశారు. రింకూ 4 క్యాచ్‌లు అందుకున్నారు. IND గెలవాలంటే 216 పరుగులు చేయాలి.
News January 28, 2026
గెలుపు గుర్రాలపై గులాబీ గురి

TG: 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు నామినేషన్ల గడువు ఈనెల 30తో ముగుస్తుంది. ఈ ఎన్నికల్లో గెలిచేవారినే పార్టీ అభ్యర్థులుగా నిలపాలని BRS నిర్ణయించింది. అలాంటి వారిని ఎంపిక చేసే బాధ్యతను రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది నాయకులకు అప్పగించింది. ఎంపికతో పాటు పార్టీ గెలుపు వ్యూహాలనూ అమలు చేయాలని వారిని ఆదేశించింది. అధికార INC నేతల కదలికలను గమనిస్తూ అధిష్ఠానాన్ని అప్రమత్తం చేయాలని సూచించింది.


