News August 21, 2025
దూసుకుపోతున్న KPHB ‘రియల్’ బిజినెస్

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా తగ్గుముఖం పడుతోందని వస్తున్న వార్తలను పటాపంచలు చేస్తూ KPHB కాలనీలో ఎకరం ఏకంగా రూ.70 కోట్లు పలికింది. ఐటీ కారిడార్‌కు పక్కనే ఉండడం, కమర్షియల్ నిర్మాణాలు శరవేగంగా పెరగుతుండటంతో ఇక్కడి రియల్ వ్యాపారం దూసుకుపోతోందని నిపుణుల అంచనా. గతంలో హౌసింగ్ బోర్డు వేలం వేసిన ప్రతి వేలంపాటలో కూడా ఎక్కడా లేని విధంగా ధర పలుకుతూ వచ్చింది. ఇప్పుడు నగరంలో KPHB హాట్ కేక్‌గా మారింది.
Similar News
News April 14, 2026
విద్యార్థులు, తల్లిదండ్రులకు జిల్లా ఇంటర్ RIO కీలక సూచనలు

రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి ధైర్యం చెప్పాలని జిల్లా ఇంటర్ RIO అధికారి వరప్రసాదరావు సూచించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎటువంటి అవమానాలకు లోను కాకుండా ధైర్యంగా తదుపరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.
News April 14, 2026
హాలియా: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

అనుముల మండల కేంద్రమైన హాలియాలో పోలీసులు వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. ఒక నివాస గృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో మంగళవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
News April 14, 2026
విశాఖ జూలో సింహం మృతి

విశాఖలోని ఇందిర గాంధీ జూపార్కులో ‘లియో’ అనే 7 సంవత్సరాల మగ ఆసియాటిక్ సింహం మంగళవారం మృతి చెందింది. అస్సాం నుంచి జంతు మార్పిడి కార్యక్రమం ద్వారా తీసుకువచ్చిన ఈ సింహం క్వారంటైన్‌లో ఉండగా అనారోగ్యానికి గురైంది. మార్చి 19న పరీక్షల్లో ట్రైపానోసోమియాసిస్, ఎర్లిచియోసిస్ అనే రక్త సంబంధిత వ్యాధులు ఉన్నట్లు తేలింది.ఈ వ్యాధుల ప్రభావంతో అవయవాలు పనిచేయకపోవడంతో సింహం మృతి చెందినట్లు జూ క్యూరేటర్ తెలిపారు.


