News April 29, 2024

దెందులూరు: చింతమనేని సెంటిమెంట్ ఏంటో తెలుసా..?

image

దెందులూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ ఎన్నికల ప్రచారంలో ఖాకీ దుస్తులు ధరించడం సెంటిమెంట్. నందమూరి తారక రామారావు తన తొలి రాజకీయ ప్రచారంలో ఖాకీ దుస్తులు ధరించి సక్సెస్ అయ్యారని అందుకే ఇలా ప్రచారం చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. అంతేకాకుండా 2009లో చింతమనేని తొలిసారి MLAగా పోటీచేసినప్పుడు ప్రచారం చేసేందుకు వచ్చిన జూనియర్ NTR సైతం ఖాకీ దుస్తుల్లోనే ప్రచారం చేశారు.

Similar News

News July 5, 2025

పారిశుద్ధ్యం పనులపై జేసీ అసహనం

image

భీమవరం పట్టణంలో చెత్త నిర్మూలనకు ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో పారిశుద్ధ్యానికి తీసుకోవలసిన చర్యలపై భీమవరం ఆర్డీవో మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. పారిశుద్ధ్యం మెరుగుదలకు ఎన్ని చర్యలు చేపట్టినా నామ్ కే వాస్తే అనే చందంగా ఉందని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.

News July 4, 2025

మొగల్తూరు: కారు ఢీకొని రైతు మృతి

image

పేరుపాలెం నార్త్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు గుత్తుల పెద్దిరాజు మృతి చెందారు. పేరుపాలెం బీచ్ నుంచి భీమవరం వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలో అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ పక్కనే పచ్చగడ్డి కోస్తున్న పెద్దిరాజును కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న వారికి ఏమి కాలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

News July 4, 2025

తణుకులో అత్యధిక వర్షపాతం నమోదు

image

గడచిన 24 గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 34.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా తణుకు మండలంలో 12.2, ఆచంట 5.2, పెంటపాడు 4.2, పోడూరు 3.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. యలమంచిలి, పాలకొల్లు, నరసాపురం, మొగల్తూరు, కాళ్ల, భీమవరం, వీరవాసరం మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని వెల్లడించారు.