News September 4, 2025
దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలి: BHPL కలెక్టర్

వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు వెంటనే చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు త్వరగా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. నష్టపరిహారం పనులు త్వరగా పూర్తి చేయడానికి అంచనాలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
Similar News
News September 7, 2025
ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమా ఇప్పట్లో ఉంటుందా?

ప్రభాస్‌తో సినిమా చేసేందుకు స్క్రిప్ట్ రెడీగా ఉందని, హీరో డేట్స్ దొరకడమే ఆలస్యమని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పడంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’తో బిజీగా ఉన్నారు. తర్వాత స్పిరిట్, కల్కి-2, సలార్-2 లైన్‌లో ఉన్నాయి. అటు ప్రశాంత్ ‘జై హనుమాన్’ తీస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో సినిమా రావడానికి మరింత టైమ్ పట్టే ఛాన్సుంది.
News September 7, 2025
సోషల్ మీడియాలో ప్రచారం అవాస్తవం: VZM కలెక్టర్

జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ అంబేడ్కర్ శనివారం మరోసారి ప్రకటించారు. రాజాంలోని నందిని ట్రేడర్స్‌కు ఈనెల 4న 24 టన్నుల యూరియా సరఫరా చేశామని, తగినంత స్టాకు ఉందన్నారు. షాపు దగ్గర నిలుచున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన చిన్నపాటి ఘర్షణే గొడవకు కారణమన్నారు. దీనికి ఎరువుల సరఫరాతో సంబంధం లేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. అవసరమైనంత ఎరువులను సరఫరా చేస్తున్నామన్నారు.
News September 7, 2025
ఏ దేవుణ్ని ఏ సమయంలో పూజిస్తే మంచిది?

మన ఇష్ట దైవాన్ని ఏ సమయంలోనైనా పూజించవచ్చు. అయితే కొన్ని సమయాలు ఆయా దేవుళ్లకు అనుకూలంగా ఉంటాయని పండితులు అంటున్నారు. వాటి ప్రకారం.. సూర్యుణ్ని ఉదయం 6 గంటల లోపు పూజించాలి. అప్పుడే రాముడు, వేంకటేశ్వర స్వామిని పూజించవచ్చు. శివుణ్ని ఉదయం, సాయంత్రం 6 గంటల తర్వాత పూజిస్తే మంచి ఫలితం దక్కుతుంది. మధ్యాహ్నం వేళ హనుమంతుణ్ని పూజిస్తే ఆయన కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి. లక్ష్మీదేవి పూజకు రాత్రి 6-9 అనువైన సమయం.