News March 13, 2025
దేవరకద్ర: చికిత్స పొందుతూ మహిళ మృతి

దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలానికి చెందిన నీలి నాగన్న కూతురు దండు మంగమ్మ మంగళవారం కూలీ పనులకు వెళుతుండగా కారు ఢీ కొనగా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 13, 2025
వనపర్తి: కీచక ఉపాధ్యాయులపై సస్పెన్షన్

విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ డీఇవో అబ్దుల్ ఘని ఉత్తర్వులుజారీ చేశారు. పాన్‌గల్ జడ్పీ హైస్కూల్‌లో పనిచేస్తున్న చిన్న నాగన్న, రఘురాం ఈనెల 5న స్కూల్‌లో నిర్వహించిన వార్షికోత్సవంలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. డీఇవో విచారణ చేసి టీచర్లను సస్పెండ్ చేశారు. హెచ్ఎం విజయ్, టీచర్ కిరణ్‌కు షోకాస్ నోటీస్ జారీ చేశారు.
News March 13, 2025
GOOD NEWS.. హైదరాబాద్‌లోకి MBNR జిల్లా గ్రామాలు

హైదరాబాద్ విస్తరణ పరిధి పెరగనుంది. HMDA స్థానంలో HYD మెట్రోపాలిటన్ రీజియన్(HMR)ను ప్రభుత్వం తీసుకురానుంది. త్వరలో RRR అందుబాటులోకి రానుండడంతో ఫ్యూచర్‌లో అవసరాల కోసం ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగా MBNR జిల్లాలోని 19 గ్రామాలను HMR పరిధిలోకి ప్రభుత్వం తీసుకురానుంది. సెమీ అర్బన్‌గా పరిగణిస్తూ వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు.
News March 13, 2025
మన్యంకొండ శ్రీ అలివేలు మంగ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినట్టుగానే, గుట్ట కింద వెలసిన శ్రీ అలవేలు మంగమ్మ అమ్మవారికి పాల్గుణ మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అంకురార్పణకు బుధవారం పుట్ట మట్టిని అర్చకులు శాస్త్రోక్తంగా ఆలయానికి తీసుకువచ్చారు. నవధాన్యాలను పుట్టమట్టిలో వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టారు. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణం అంటారు.